ఆ స్టార్ హీరో వల్లే.. కృష్ణభగవాన్ కెరీయర్ నాశనమయ్యిందా?

praveen
కమెడియన్ కృష్ణభగవాన్.. ఇక ఈ పేరుకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి.  ఒకప్పుడు కమెడియన్గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు తిరుగు లేదు అని నిరూపించాడు.  సరికొత్త కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ కడుపుబ్బా నవ్వించాడు. స్టార్ హీరోల సినిమాల దగ్గరనుంచి చిన్న హీరోల సినిమాల వరకూ అందరి సినిమాల్లో కూడా నటిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూనే వచ్చాడు అన్న విషయం తెలిసిందే.  ఇలాంటి  సమయంలో ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా కొనసాగిన కృష్ణభగవాన్ ఆ తర్వాత మాత్రం ఇండస్ట్రీలో ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు.

 అయితే నేటి రోజుల్లో కమెడియన్స్ నుంచి ఎక్కువ పోటీ ఉన్న నేపథ్యంలో ఇక కృష్ణభగవాన్ కు అవకాశాలు రావడంలేదని..  అందుకే ఇండస్ట్రీకి కృష్ణభగవాన్ దూరం  అయిపోయారు అని అనుకుంటూ ఉంటారు అందరు.   కానీ కృష్ణ భగవాన్ కెరియర్  ఒక స్టార్ హీరో కారణంగా నాశనమైంది అనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి.  కృష్ణభగవాన్ స్టార్ హీరోల సినిమాల్లో చేస్తున్న సమయంలో అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ క్రమంలోనే  ఒక స్టార్ హీరో తన సినిమాల్లో నటించాలని కృష్ణభగవాన్ ను  కోరాడట. కానీ ఆ సమయంలో ఆరోగ్యం బాగా లేకపోవడంతో సినిమా వదులు కున్నాడట కృష్ణ భగవాన్.

 చివరికి ఆ సినిమాలో వేరే కమెడియన్ ని పెట్టుకొన్నప్పటికీ ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదు. దీంతో ఆ హీరో ఇదంతా మనసులో పెట్టుకొని కృష్ణ భగవాన్ ని దారుణంగా అవమానించారట. ఇక ఆయన మనసును బాధ పట్టేలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడట.  ఆ తర్వాత కాలంలో మిగతా స్టార్ హీరోల సినిమాల్లో కూడా కృష్ణభగవాన్ కు  ఛాన్సులు రాకుండా కూడా చేశాడట.  ఇలా ఒకప్పుడు తన కామెడీ టైమింగ్ తో ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ ను సృష్టించిన కృష్ణభగవాన్ ఒక స్టార్ హీరో కారణంగా ఇండస్ట్రీకి దూరం అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: