మహేష్ 28వ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా భరత్ అనే నేను , మహర్షి ,  సరిలేరు నీకెవ్వరు  తాజాగా విడుదల అయిన సర్కారు వారి పాట మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకుంటు ప్రస్తుతం ఫుల్ జోష్ లో కెరియర్ ని ముందుకు సాగిస్తున్నాడు. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరి కొన్ని రోజుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు.

ఈ మూవీ మహేష్ బాబు కెరీర్ లో 28 వ మూవీగా తెరకెక్కబోతుంది. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి కూడా చాలా రోజులే అవుతుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల రెండవ వారం నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించినుండగా , తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించ బోతున్నాడు.

ఈ మూవీ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ మోడ్రన్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తిరకేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కోసం భారీ ఖర్చుతో రామోజీ ఫిలిం సిటీ లో ఒక అద్భుతమైన ఇంటి సెట్ ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లోనే ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం పూర్తి కానున్నట్లు కూడా తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: