ప్రేమలో పడ్డ జబర్దస్త్ హైపర్ ఆది.. అసలు విషయాన్ని బయటపెట్టిన కమెడియన్..!

Divya
జబర్దస్త్ షో ద్వారా తెలుగు బుల్లితెర పైకి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను  సొంతం చేసుకున్న కమెడియన్ లలో జబర్దస్త్ హైపర్ ఆది కూడా ఒకరు.  జబర్దస్త్లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఊహించని స్థాయికి ఎదిగిపోయారు. ఇకపోతే హైపర్ ఆది అసాధారణమైన టాలెంటు అదిరిపోయే పంచ్ లతో  ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఇతడు అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై కూడా సందడి చేస్తూ ఉంటాడు. ఇకపోతే బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కూడా హైపర్ ఆది గుర్తింపు తెచ్చుకున్నారు ఇదిలా ఉండగా.. తాజాగా జరిగిన ఒక కార్యక్రమానికి వెళ్లిన హైపర్ ఆది ఒక సీరియల్ నటితో ప్రేమలో పడినట్లు తెలిపాడు.
సుదీర్ఘకాలంగా ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో ఎంతోమంది టీమ్ లీడర్లుగా పనిచేశారు.. ఈ కామెడీ షో చరిత్రలోనే హైపర్ ఆది ఒంటి చేత్తో స్కిట్లను నడిపించిన గొప్ప కమెడియన్ అని చెప్పవచ్చు. తక్కువ సమయంలోనే ఎక్కువ ఎపిసోడ్స్ గెలుపొందిన టీం లీడర్ గా అతడికి అద్భుతమైన రికార్డు కూడా ఉంది. కేవలం జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ,  ఢీ 14 వంటి షోలలో కూడా పనిచేస్తున్నాడు. ఇక ప్రముఖ ఈటీవీ ఛానల్ 27 సంవత్సరాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో అందులో పనిచేసిన , చేస్తున్న ఆర్టిస్టులతో స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు.  దీనికి భలే మంచి రోజు అని పేరు కూడా పెట్టారు.
ఇక ఈవెంట్ ఇప్పటికే ఒక భాగం పూర్తయింది. రెండో చాప్టర్ సెప్టెంబర్ 4వ తేదీన ప్రసారం కాబోతోంది. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమో ను  కూడా విడుదల చేయగా.. అందులో హైపర్ ఆది లవ్ ట్రాక్ గురించి వెల్లడించారు. ఇందులో భాగంగానే భలే మంచి రోజు ఈవెంట్ లో  హైపర్ ఆది శతమానంభవతి సీరియల్ నటితో ప్రేమలో పడినట్లు నటించాడు. దీంతో వీళ్ళిద్దరికీ లవ్ సింబల్ వేసి మరి తెగ హైలైట్ చేశారు. ఈ ఈవెంట్ కి శతమానం భవతి సీరియల్ టీం కూడా రావడంతో అప్పుడు ఆది వాళ్ళ పై పంచులు వేస్తూ ఒక నటి దగ్గరకు వచ్చి ప్రేమలో పడినట్లు చెప్పాడు. దీంతో ఆమె కూడా అతడికి సహకరిస్తూ డాన్స్ చేసింది. ఇక హైపర్ ఆది ఈనటి నా సొంతం  అన్నట్టుగా కామెంట్ చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: