'జల్సా' 4కే వర్షన్ కు అదిరిపోయే రెస్పాన్స్..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించిన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగు తున్నాడు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ కెరియర్ లో సూపర్ హిట్ గా నిలిచిన మూవీ లలో జల్సా సినిమా ఒకటి.

జల్సా సినిమా అప్పట్లో సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా ,  ఇలియానా , పార్వతి మెల్టన్ ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా ,  గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ మూవీ ని నిర్మించారు. ఇది ఇలా ఉంటే అప్పట్లో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న జల్సా మూవీ ని మళ్ళీ తిరిగి థియేటర్ లలో  రీ రిలీజ్ చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 1 వ తేదీన జల్సా మూవీ ని 4 కె వర్షన్ లో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా రీ రిలీజ్ కి ఇప్పటికే నిర్మాణ సంస్థ 501 ప్లస్ షో లని ఏర్పాటు చేసింది. వీటన్నింటికీ కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. జల్సా 4  కే వర్షన్ గురించి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అయిన సెప్టెంబర్ 2 వ తేదీ కంటే ఒక రోజు ముందు గానే సెప్టెంబర్ 1 వ తేదీన జల్సా మూవీ 4 కే వర్షన్ థియేటర్ లలో సందడి చేయబోతుంది. దీనితో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: