వర్మ గ్రూప్ నుండి మరొక నటి బిగ్ బాస్ లోకి ఎంట్రీ..!!

Divya
తెలుగులో బిగ్ బాస్ సరికొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది.. ఇప్పటివరకు బిగ్ బాస్ 5 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అందులో ఒకటి ఓటీటి బిగ్ బాస్ సీజన్ పూర్తి చేసుకుంది.. ఇక మరొక వారం రోజులలో రెగ్యులర్గా బిగ్ బాస్ సీజన్ -6 కు సంబంధించి ప్రసారం కాబోతున్నది భారీ ఎత్తున ప్రేక్షకులు ఈ బిగ్ బాస్ కోసం ఎదురుచూస్తున్నారు అయితే ఇప్పుడు తాజాగా ఇందులో కంటిస్టెంట్ల విషయంపై ఆసక్తికరమైన విషయాలు వెళ్ళబడ్డాయి వాటి గురించి చూద్దాం.

బిగ్ బాస్ సీజన్ 6 యొక్క కంటెస్టెంట్ల విషయంలో పలు రకాలుగా వార్తలు వస్తున్నాయి మొదటి నుంచి ఉదయభాను ఈ షో లో ఉంటుంది అంటు పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి ఆమెకు ఎక్కువ పారితోషకం ఇస్తున్నారనే వార్తలు కూడా వినిపించాయి.. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ లో ఉదయభాను పాల్గొనే అవకాశం లేదు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బిగ్ బాస్ సీజన్-6 కి సంబంధించి వర్మ కంపెనీ నుండి ఒక ముద్దుగుమ్మ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఆమె ఎవరో కాదు ఇనా యా సుల్తానా. ఇమే గతంలో ఎన్నోసార్లు వర్మ వేడుకలలో పాల్గొన్నది.. ఈమె నటి కూడా.

వర్మతో కలిసి పలుసార్లు డ్యాన్స్ వీడియోలు చేయడంతో వర్మ ఆమెతో చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో విడుదల చేసేది. ఇక గతంలో కూడా వర్మ వల్ల ఆరియనా రెండుసార్లు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అదంతా కేవలం వర్మ వల్ల వచ్చిన గుర్తింపు అని చెప్పవచ్చు. ఇక మరొక నటి శ్రీ రాపాక కూడా వర్మ దగ్గర నుంచి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది. ఇక వచ్చే సీజన్లో కూడా మరొక ముద్దుగుమ్మ వర్మ కంపెనీ నుండి తీసుకొని అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వర్మ దగ్గర నుంచి వచ్చిన వారు అందరూ ఎక్కువగా చాలా బోల్డ్ గా వ్యవహరిస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: