ఆ సినిమాను కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మళ్లీ విడుదల చేయనున్నారా..!

Pulgam Srinivas
సెప్టెంబర్ 2 వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా అయినటు వంటి జల్సా మూవీ ని 4  కే వర్షన్ ని విడుదల చేయనున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సన్నాహాలు కూడా ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి.

జల్సా మూవీ ని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూర్ , మరియు విదేశాల్లో కూడా విడుదల చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేసింది. ఈ మూవీ ప్రీమియర్ షో లను విదేశాలలో సెప్టెంబర్ 1 వ తేదీ నుండి జరగనున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జల్సా మూవీ 4 కె వర్షన్ కి పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి అదిరి పోయే రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా మూవీ తో పాటు మరో మూవీ ని కూడా ప్రదర్శించే ఏర్పాటు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలలో ఒకటి అయిన తమ్ముడు మూవీ ని ఆగస్టు 31 న ప్రీ బర్త్‌ డే వేడుకలుగా ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం సాధించడం మాత్రమే కాకుండా , కలెక్షన్ ల వర్షాన్ని కురిపించింది. అలాగే ఈ మూవీ లోని పవన్ కళ్యాణ్ స్టైల్ కి , ఆటిట్యూడ్ కి , డ్రెస్సింగ్ స్టైల్ కి ఎంతో మంది కుర్ర కారు ఫిదా అయి పోయారు. అలా అప్పట్లో యువతను ఫిదా చేసిన తమ్ముడు సినిమాను మరో సారి పవన్ కళ్యాణ్ ఫ్రీ బర్తడే సెలబ్రేషన్ లలో భాగంగా  ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: