రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ 'ఓటిటి' విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం మొదట్లో రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఖిలాడి మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో రవితేజ సరసన డింపుల్ హయాతి , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించారు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఖిలాడి సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకో లేక పోయింది. చివరకు ఖిలాడి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే ఖిలాడి సినిమాతో బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన మాస్ మహారాజ రవితేజ తాజాగా రామారావు ఆన్ డ్యూటీ మూవీ తో ప్రేక్షకులను మరొక సారి పలకరించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి శరత్ మండువా దర్శకత్వం వహించగా రాజేష విజయన్ , దివ్యాంశ కౌశిక్ ఈ మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ లుగా నటించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇలా థియేటర్ లలో ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లోకి రాబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వచ్చేసింది. రామారావు ఆన్ డ్యూటీ మూవీ సెప్టెంబర్ 15 వ తేదీ నుండి సోనీ లీవ్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని సోని లీవ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే సెప్టెంబర్ 15 వ తేదీ నుండి సోనీ లీవ్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: