'జల్సా' మూవీ 4కే వర్షన్ కి పెరిగిన క్రేజ్..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జల్సా ని 4 వర్షన్ లో విడుదల చేయాలి అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుండో నిర్మాతలను డిమాండ్ చేయగా , ఎట్ట కేలకు జల్సా మూవీ ని 4 కే వర్షన్ లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయడానికి చిత్త బృందం సిద్ధం అయ్యింది.

ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లు ఉండగా , అందులో జల్సా మూవీ ఒకటి. జల్సా మూవీ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా గోవా బ్యూటీ ఇలియానా , పార్వతి మెల్టన్ ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇది ఇలా ఉంటే మొదట ఈ సినిమా 4 కే వర్షన్ విడుదల చేయాలి అని అభిమానుల నుండి చాలా డిమాండ్ లు వెళ్లివేత్తాయి. అలాగే ఈ సినిమా 4 కే వర్షన్ పై భారీ అంచనాలు ఉన్నట్లుగా కూడా కనిపించింది. కాక పోతే మధ్యలో కొన్ని రోజులు ఈ సినిమా 4 కే వర్షన్ కి అంతగా డిమాండ్ లేదు అంటూ కూడా వార్తలు బయటకు వచ్చాయి.

కాక పోతే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అయిన సెప్టెంబర్ 2 వ తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా 4 కే వర్షన్ కి ఉన్న డిమాండ్ ఏమిటో స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం ఈ సినిమా 4 కే వర్షన్ కి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ని ఓవర్ సీస్ లో  సరిగమ సంస్థ విడుదల చేయబోతుంది. అలాగే బెంగళూరు మరియు తెలుగు రాష్ట్రాలలో బుకింగ్స్ మరియు థియేటర్ లిస్ట్ కూడా మరి కొద్ది రోజు ల్లోనే విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: