పొన్నియన్ సెల్వన్ మూవీ నుంచీ ఐశ్వర్యరాయ్ పిక్ వైరల్..!!

Divya
అందాల తార మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ ముద్దుగుమ్మ తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ రాణీ నందినిగా ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ సినిమా చిత్రీకరణ సెట్స్ నుంచి తాజాగా ఐశ్వర్యరాయ్ పాత్రకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతూ ఉండగా.. అవర్ క్వీన్ ఇస్ బ్యాక్ అనే కామెంట్లతో నేటిజన్ లు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు.
48 సంవత్సరాల వయసు కలిగిన ఐశ్వర్యరాయ్ పెళ్లి తర్వాత కేవలం కొన్ని సినిమాలలో మాత్రమే నటించింది. ఇక 2018లో  ఫాన్నీ ఖాన్ అనే చిత్రంలో చివరిసారిగా మెరిసిన ఐశ్వర్య రాయ్ ఇప్పుడు మళ్ళీ మణిరత్నం దర్శకత్వం లో తెరకెక్కుతున్న తమిళ్ సినిమా  పొన్నియన్ సెల్వన్ తో కనిపించబోతున్నారు . జూలై 19వ తేదీన ఇంస్టాగ్రామ్ ఖాతాలో చిత్రంలో తన పాత్రకు సంబంధించిన ఫోటోలు షేర్ చేయడం ద్వారా ఈ చిత్రంలో నటించబోతున్నట్లు అధికారికంగా ఐశ్వర్య ప్రకటించారు. అంతేకాదు ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్యరాయ్ మాట్లాడుతూ.. ఇప్పటికీ నా ప్రాధాన్యత కుటుంబం , కూతురికే ఇస్తాను. ఇక కరోనా మహమ్మారి కాలంలో ధైర్యం చేసి మనీ సార్  సినిమా చేయడానికి ఒప్పుకున్నాను .అయితే ఇది కూతురు ఆరాధ్య,  కుటుంబం పైనుంచి నా ఫోకస్ మరల్చలేదని ఆమె తెలిపింది. ఇకపోతే ఈ సినిమా పార్ట్ వన్ తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో సెప్టెంబర్ 30 తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
1995లో పొన్నియన్ సెల్వన్ పేరుతో కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఇందులో ఐశ్వర్యతో పాటు జయం రవి ,విక్రమ్ , త్రిష, కార్తీ, ఐశ్వర్య లక్ష్మి ,శోభిత దూళిపాల, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, ప్రకాష్, రెహ్మాన్ , జయరామ్ ఆర్, పార్థివన్ తదితరులు నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: