బాలీవుడ్ లో బిజినెస్ మాన్ మూవీ రీమేక్ ఉంటుంది... పూరి జగన్నాథ్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో ఒకరుగా కొనసాగుతున్న పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . పూరి జగన్నాథ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బద్రి మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ ని మొదలు పెట్టాడు . మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత ఇడియట్ , ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం , అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి , శివమణి , పోకిరి , దేశముదురు , చిరుత , బిజినెస్ మాన్ , టెంపర్ , ఈస్మార్ట్ శంకర్ వంటి ఎన్నో విజయవంతమైన మూవీ లకు దర్శకత్వం వహించి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో ఒకరు గా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా పూరి జగన్నాథ్ 'లైగర్' మూవీ కి దర్శకత్వం వహించాడు.

ఈ మూవీ లో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా, అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో రమ్యకృష్ణ, విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించగా, మైక్ టైసన్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ ఈ రోజు అనగా ఆగస్ట్ 25 వ తేదీన విడుదల అయ్యింది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా పూరి జగన్నాథ్ 'బిజినెస్ మాన్' రీమేక్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజా ఇంటర్వ్యూలో పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ ...  బిజినెస్ మాన్ మూవీ ని హిందీ లో రీమేక్ చేసే ఆలోచన ఉంది అని , అందుకు సంబంధించిన సన్నాహాలను త్వరలోనే మొదలు పెడతాను అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా పూరి జగన్నాథ్ చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: