లైగర్ : రివ్యూ ( పూరీ ఓడాడు.. విజయ్ గెలిచాడు)

shami
డ్యాషింగ్ హీరో విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా లైగర్. పాన్ ఇండియా వైడ్ ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
కరీం నగర్ లో ఉండే లైగర్ (విజయ్ దేవరకొండ) అతని మదర్ బాలామణి (రమ్యకృష్ణ) సడెన్ గా ముంబైకి వస్తరు. కొడుకు మిస్కెడ్ మార్షల్ ఆర్ట్స్ ఎం.ఎం.ఏ లో నేషనల్ ఛాంపియన్ అవ్వాలని కోరుకుంటుంది బాలామణి. లైగర్ తండ్రి కూడా పెద్ద ఫైటర్ అని చెప్పి కొడుకుని అంతకుమించి చేయాలని అనుకుంటుంది. లైగర్ కూడా అందుకు కష్టపడతాడు. కోచ్ సాయంతో ఎన్ని కష్టాలు వచ్చినా ఎం.ఎం.ఏ పై దృష్టి పెడతాడు. ఇక అలా ఒక లక్ష్యంతో వెళ్తున్న లైగర్ జీవితంలోకి తాన్యా (అనన్యా పాండే) వస్తుంది. ఆమె ప్రేమలో పడి అతను అతను లక్ష్యానికి దూరమవుతాడు. ఈ క్రమంలో లైగర్ మళ్లీ ఎలా ఎం.ఎం.ఏ మీద దృష్టి పెట్టాడు. అతనికి తాన్యా ఎలా హెల్ప్ అయ్యింది. లాస్ వెగాస్ లో జరిగే వరల్డ్ ఎం.ఎం.ఏ ఛాంపియన్ షిప్ కి ఎలా వెళ్లాడు. ఇంతకీ మైక్ టైసన్ ఎవరు. తన తల్లి లక్ష్యం లైగర్ నెరవేర్చాడా లేదా అన్నది సినిమా కథ.
విశ్లేషణ :
లైగర్ గా విజయ్ దేవరకొండ కష్టం తెర మీద కనిపిస్తుంది. కానీ ఆ కష్టానికి తగిన కథ, కథనం సినిమాలో లేదని చెప్పొచ్చు. పూరీ ఒక రొటీన్ రెగ్యులర్ కథనే లైగర్ గా రాసుకున్నాడు. అయితే ఇందులో విజయ్ పాత్ర మీద భారీ యాక్షన్ సీన్స్ మీద నడిపిద్దామని అనుకొని ఉండొచ్చు. కానీ కథ పాతదే.. కథనం కూడా అదే ఫార్మెట్ లో వెళ్లినప్పుడు హీరో క్యారక్టరైజేషన్ ఎంత బాగున్నా ఆడియెన్స్ కి ఎక్కదు.
అంతేకాదు విజయ్ కి పెట్టిన ఆ నత్తి కూడా ఫస్ట్ లో ఓకే అనిపిస్తుంది కానీ తర్వాత తర్వాత కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే అది హీరో పాత్ర పర్ఫెక్ట్ గా ఉండటానికి పెట్టుకున్నదే అనుకోవచ్చు. ఇక హీరోయిన్ రోల్ చాలా రొటీన్ గా ఉంటుంది. హీరో హీరోయిన్ ల మధ్య లవ్ స్టోరీ కూడా అంత ఇంప్యాక్ట్ కలిగించదు.
విజయ్ పూరీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని అంతా ఒమ్ము చేశాడని చెప్పొచ్చు. ఒక రొటీన్ కథని అదే రొటీన్ స్క్రీన్ ప్లేతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ తో పూరీ మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడని అనుకోగా లైగర్ తో అది మళ్లీ తప్పని ప్రూవ్ చేశాడు. విజయ్ తో పూరీ ఒక మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడని చెప్పొచ్చు.
నటీనటుల ప్రతిభ :
లైగర్ సినిమాలో విజయ్ వన్ మ్యాన్ షో చేశాడు. తన బాడీ ట్రాన్స్ ఫర్ మేషన్ తో షాక్ ఇచ్చాడు విజయ్. సినిమా కోసం విజయ్ కష్టపడాల్సిందంతా కష్టపడ్డాడని చెప్పొచ్చు. ఇక అనన్యా పాండే పాత్ర పెద్దగా మెప్పించలేదు. సినిమాలో ఆమె పాత్ర జస్ట్ గ్లామర్ కోసం సాంగ్స్ కోసమే అని చెప్పొచ్చు. మైక్ టైసన్ పాత్ర ఆశించిన స్థాయిలో లేదు. రమ్యకృష్ణ తన పత్ర వరకు న్యాయం చేసింది. గెటప్ శ్రీను, అలి పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
సాంకేతికవర్గం పనితీరు :
లైగర్ సినిమాకు మ్యూజిక్ పెద్దగా ఇంప్యాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. బిజిఎం వరకు ఓకే. అకిడి పకిడి సాంగ్ లో విజయ్ డ్యాన్స్ అలరిస్తుంది. సినిమాటోగ్రఫీ మాత్రం ఇంప్రెస్ చేస్తుంది. కెమెరా మెన్ వర్క్ బాగుంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. పూరీ మాత్రం తన మార్క్ చూపించలేకపోయాడు. విజయ్ లాంటి హీరోతో పాన్ ఇండియా సినిమా తీసి విఫల ప్రయత్నం అనిపించాడు.
ప్లస్ పాయింట్స్ :
విజయ్
సినిమాటోగ్రఫీ
బిజిఎం
మైనస్ పాయింట్స్ :
రొటీన్ స్టోరీ
స్క్రీన్ ప్లే
బలమైన సన్నివేషాలు లేకపోవడం
బాటం లైన్ :
లైగర్.. పూరీ ఓడాడు.. విజయ్ గెలిచాడు..!
రేటింగ్ : 2/5

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: