మరొకసారి మంచి మనసు చాటుకున్న సోను సూద్..!!

Divya
 కరోనా వైరస్ మహమ్మారి దేశంలోనే పెద్ద అలజడి సృష్టించిందని చెప్పవచ్చు ఆ సమయంలో నటుడు సోనుసూద్ మానవత్వంతో స్పందించి ఎంతోమందికి సహాయంగా నిలిచారు. ఇలా అండగా ఎంతోమంది ప్రముఖులు కూడా నిలిచారు. అప్పటినుంచి మొదలైన సోనుసూద్ సేవా కార్యక్రమాలు పరంపరం ఇంకా ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాయి. తన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మందికి సహాయం చేశారు అవసరమైన వారికి నేను అండగా ఉంటానని భరోసా కూడా కల్పించారు. ఇప్పుడు మరొకసారి ఈ నేపథ్యంలోనే ఒక స్టూడెంట్ రిపోర్టర్ గా మారి తమ పాఠశాలలో ఉన్న సమస్యలను సైతం ఒక వీడియో రూపంలో షేర్ చేయడం జరిగింది ఆ వీడియో దృష్టికి చేరుకుంది.

స్కూల్ ఆవరణంలో ఉన్న పలు సమస్యలను అందరికీ తెలిసేలా వివరిస్తూ ఒక రిపోర్టింగ్ చేయడం జరిగింది ఇక ఆ వీడియో వైరల్ గా మారుతోంది. దీంతో స్టూడెంట్  అయినా సర్పరాజ్ చదువు బాధ్యతలన్నిటిని సోను సూద్ తీసుకోవడం జరిగింది. జార్ఖండ్ లోని గొడ్డ జిల్లాలోనే మహాగామా బ్లాక్ లోని ప్రభుత్వ పాఠశాల నిర్లక్ష్యానికి గురవుతూ అభివృద్ధికి దూరంలో నిలిచింది. స్కూల్ ఆవరణంలో చుట్టూ పిచ్చి మొక్కలు మొలవడం పాఠశాలకు రాని ఉపాధ్యాయులు కనీస సదుపాయాలకు కరువైన నేపథ్యంలో.. ఆ స్కూల్లో ఉండే విద్యార్థులు చదువుకునేందుకు ఎక్కువ మక్కువ చూపడం లేదు.. అందుచేతనే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

దీంతో సర్ప రాజ్ అనే ఒక 12 ఏళ్ల విద్యార్థి రిపోర్టర్ అవతారం ఎత్తి ఒక ప్లాస్టిక్ బాటిల్ కి కర్ర చుట్టి మైక్ తరహాలో తయారుచేసి ఆ మైకును పట్టుకొని తోటి విద్యార్థులను ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా స్కూల్ ఆవరణంలో ఉన్న సమస్యలను అందరికీ తెలిసేలా తెలియజేశారు. ఈ రిపోర్టింగ్ తో సర్ప రాజ్ చాలా వైరల్ గా మారారు. దీనిని చూసిన సోనుసు తాజాగా స్పందించడం జరిగింది.. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారు తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: