రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న ప్రభాస్... మారుతి సినిమా..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిర్చి మోవిర్ వరకు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగిన ప్రభాస్ 'మిర్చి' మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి మూవీ తో దేశ వ్యాప్తంగా అదిరి పోయే రేంజ్ లో క్రేజ్ ని సంపాదించు కున్నాడు.

అందులో భాగంగా ప్రభాస్ 'బాహుబలి' సినిమా తర్వాత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లలో , అంతకు మించిన మూవీ లలో నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే  మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లు అన్ని కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీలే. ఇది ఇలా ఉంటే ఈ మూడు మూవీ లతో పాటు ప్రభాస్ , మారుతి దర్శకత్వంలో కూడా ఒక మూవీ లో నటించడానికి కమిట్ అయిన విషయం మన అందరికి తెలిసిందే.

ఈ విషయాన్ని దర్శకుడు మారుతీ కూడా ఇది వరకే  కన్ఫర్మ్ కూడా చేశాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఈ మూవీ కి సంబంధించిన పూజా కార్యక్రమాలను చిత్ర బృందం రేపు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని దర్శకుడు మారుతి తక్కువ రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు మారుతి కొంత కాలం క్రితమే గోపీచంద్ హీరోగా తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో రాశి కన్నా హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: