బింబిసార ఓటిటి లో వచ్చేది ఎప్పుడంటే..!!

Divya
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ముఖ్యమైన పాత్రలో నటించిన చిత్రం బింబిసారా. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి విశేష స్పందనతో లభించింది. ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా మంచి విజయాన్ని అందుకుంది.. డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇందులో ఆయన నటనకు ప్రేక్షకులు సినీ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యి ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఇదంతా డైరెక్టర్ వశిష్ట, కళ్యాణ్ రామ్ నటన ఈ సినిమాకు ప్రశంసలు దక్కించేలా చేశాయి.

ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో అత్యధిక వసూలు రాబట్టి పేను సంచలనాన్ని సృష్టించింది. పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ కథ అంశంతో తెరకెక్కించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందించారు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ నిర్మించారు థియేటర్లలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు తాజాగా ఓటిటి లో సందడి చేయబోతోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా స్ట్రిమింగ్ హక్కులను మాత్రం..zee -5 సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఇక ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాత విడుదల చేసుకునే విధంగా ఒప్పందం కుదిరించినట్లు సమాచారం. మరి ఈ సినిమా ఓటిపి స్త్రిమ్మింగ్ ఎప్పుడు అనే విషయాన్ని మాత్రం మేకర్ ఇంకా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ సంయుక్త మీనన్, కెథరిన్ నటించారు. ఇక ఈ సినిమాకి చోటా కె నాయుడు చాయ గ్రహం అందించారు. ఇక శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. ఎట్టకేలకు కళ్యాణ్ రామ్ ఈ చిత్రంతో తన స్టామినా ఏంటో చూపించాడని చెప్పవచ్చు. మరి ఈ సినిమా ఓటీటి అప్డేట్ విడుదల చేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: