రాఘవేంద్ర రావు.. డైరెక్టర్ కాకపోయి ఉంటే ఏం చేసేవాడో తెలుసా?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకేంద్రుడిగా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కె.రాఘవేంద్రరావు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే అతిశయోక్తే అవుతుంది. కాగా ఇప్పటివరకు రాఘవేంద్రరావు తన సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఎంతగానో దగ్గరయ్యాడు. ఎంతోమంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఈయన తన మేకింగ్ స్టైల్ తో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు అనే చెప్పాలి. అంతే కాదు ఇండస్ట్రీ లో ఉన్న హీరోయిన్ లను రొమాంటిక్ గా చూపించడం.. వారి అందాలను మరింత అందంగా మార్చడంలో రాఘవేంద్రరావు స్టైలే వేరు అని చెప్పాలి.

 హీరోయిన్ ల మీద పండ్లు వర్షం కురిపించడం లాంటివి చేసి ప్రేక్షకులను మైమరిపించేలా చేస్తూ ఉంటాడు. కేవలం రొమాంటిక్ సినిమాలు తీయడమే కాదు అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తిరస సినిమాలు కూడా తీసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు రాఘవేంద్ర రావు. ఇప్పుడు వయసు మీద పడిన నేపథ్యంలో సినిమాలు కాస్త తగ్గించేశాడు. కొన్ని సినిమాలకు సమర్పకుడిగా మాత్రమే రాఘవేంద్రరావు వ్యవహరిస్తున్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న రాఘవేంద్రరావు తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

 ఒకవేళ మీరు దర్శకుడిగా మారక పోయి ఉంటే ఏం చేసేవారు అంటూ అడిగిన ప్రశ్నకి ఆసక్తికర సమాధానం చెప్పాడు. ఒకవేళ తాను సినిమాల్లోకి రాకపోయి ఉంటే డ్రైవర్ గా మారే వాడిని అంటూ వెల్లడించాడు. నేను బి.ఏ పూర్తి చేశాను కానీ ఆ సమయంలో నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దర్శకుడిగా మారకపోతే డ్రైవింగ్ వృత్తిలోకి వెళ్లేవాడిని అంటూ తెలిపాడు. ఎందుకంటే ఆ రోజుల్లో బి.ఏ పూర్తి చేసిన వారి కంటే డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా సంపాదించేవారు. అందుకే నేను కూడా డైరెక్టర్ కాకపోయి ఉంటే డ్రైవర్ అయ్యేవాడిని.. అయితే ఇలా ఎందుకు అంటున్నాను అంటే తనకు డ్రైవింగ్ తప్పా పెద్దగా ఏ విషయం తెలియదు అందువల్ల డైరెక్టర్ కాకపోతే కేవలం డ్రైవింగ్ మాత్రమే నాకు ఉన్న ప్రత్యామ్నాయం అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: