ఈ మూవీలో గ్లామరస్ సైకియాట్రిస్ట్ పాత్రలో కనిపించబోతున్నను... శ్రద్దాదాస్..!

Pulgam Srinivas
అల్లరి నరేష్ హీరో గా తెరకెక్కిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే తన అందచందాలతో కుర్రకారును కట్టి పడేసిన ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి తన అంద చందాలతో , నటనతో ప్రేక్షకులను మనసు దోచుకుంది .

ఇది ఇలా ఉంటే తాజాగా శ్రద్దా దాస్ 'అర్థం' అనే మూవీ లో ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ మూవీ సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కబోతుంది. ఈ మూవీ లో శ్రద్దాదాస్ 'మాయ' అనే సైకాలజిస్ట్ పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ కి మణికాంత్ తెల్లగూటి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ని రాధిక శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని కన్నడ, మలయాళ భాషల్లోకి కూడా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ మూవీ టీజర్ విడుదల సందర్భంగా శ్రద్ధాదాస్ మాట్లాడుతూ ... ఇప్పటి వరకూ తాను నటించిన మూవీ లన్నింటిలో కెల్లా ఈ మూవీ చాలా స్పెషల్ అని శ్రద్దాదాస్ చెప్పింది. దర్శక నిర్మాతలు చక్కని కథను సెలెక్ట్ చేసుకుని ఈ మూవీ ని కూడా చాలా చక్కగా తెరకెక్కించారని శ్రద్దాదాస్ తెలిపింది. ఈ మూవీ లో గ్లామరస్ సైకియాట్రిస్ట్ గా తాను నటించానని చెప్పు కొచ్చింది. మంచి టీమ్ తో మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ లో నటించడం చాలా హ్యాపీగా ఉందని శ్రద్దాదాస్ తాజాగా తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: