'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న రెండు ప్రముఖ సంస్థలు..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుధీర్ బాబు ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో హీరోగా నటించి తెలుగు నాట తన కంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరుచు కున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా సుధీర్ బాబు , ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే.

ఈ మూవీ లో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చిం.ది ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ ఓవర్ సీస్ హక్కులను రెండు ప్రముఖ సంస్థలు అయినటువంటి శ్లోక ఎంటర్టైన్మెంట్స్ , ఫ్లై హై సినిమాస్ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఇది వరకే సుధీర్ బాబు , ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేషన్ లో సమ్మోహనం మరియు వి మూవీ లు తెరకెక్కాయి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ సినిమా. ఈ మూవీ లో వెన్నెల కిషోర్ , అవసరాల శ్రీనివాస్ ,  రాహుల్ రామకృష్ణ  , సతీష్ సరిపల్లి ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా , వివేక్ సాగర్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: