సీతా రామం సినిమాపై స్పందించిన స్వీటీ...!!

murali krishna
ఈ ఏడాది థియేటర్లలో విడుదలై సక్సెస్ సాధించిన సినిమాలలో సీతారామం సినిమా కూడా ఒకటనే విషయం తెలిసిందే. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు సైతం దక్కుతున్నాయి.


హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకావ్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఊహలకందని సన్నివేశాలతో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారట.. తొలి సినిమాతోనే మృణాళ్ ఠాకూర్ మంచి పేరును సొంతం చేసుకోవడంతో సౌత్ నుంచి కూడా మృణాళ్ కు ఆఫర్లు పెరిగే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.


తాజాగా అనుష్క శెట్టి ఈ సినిమాను చూసి ఈ సినిమా గురించి అభిప్రాయాలను పంచుకున్నారు. సీతారామం మూవీ బ్యూటిఫుల్ మూవీ అని ఆమె చెప్పుకొచ్చారట.చాలా సున్నితంగా ఆలింగనం చేసుకుని సీతారాముల ప్రయాణంలోకి తీసుకెళుతున్న సినిమా సీతారామం అని ఆమె అన్నారు. సీతా, రామ్, అఫ్రీన్ లకు అభినందనలు అని అనుష్క చెప్పుకొచ్చారు. ఈ సినిమా దర్శకనిర్మాతలకు, టెక్నీషియన్లకు, సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ అనుష్క హృదయపూర్వక అభినందనలు తెలియజేశారట.


అనుష్క శెట్టి తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు అనుష్క శెట్టి మిస్ శెట్టి మిసెస్ పొలిశెట్టి అనే సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందో క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అనుష్క పరిమితంగా సినిమాలలో నటిస్తుండటంతో ఆమె అభిమానులు తెగ ఫీలవుతున్నారు.


అనుష్క స్టార్ హీరోల సినిమాలలో వరుస ఆఫర్లతో బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు అనుష్క శెట్టికి క్రేజ్ పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. అనుష్క ఇప్పటికి కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తన నటనతో ఎంతో మందిని సైతం మెప్పించింది. అనుష్క తన తరువాత సినిమాకోసం ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: