నేను ఏ ఆస్తులు అమ్ముకోలేదు... మాధవన్..!

Pulgam Srinivas
మంచి టాలెంట్ ఉన్న నటుల్లో ఒకరు అయిన ఆర్ మాధవన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . మాధవన్ ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్నాడు . మాధవన్ ఇప్పటికే తెలుగు లో కూడా అనేక మూవీ లలో అనేక పాత్ర లలో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా అలరించాడు . మాధవన్ తెలుగు లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పిం చాడు .  ఇది ఇలా ఉంటే తాజాగా మాధవన్ 'రాకెట్రీ' అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించాడు . కొంత కాలం క్రితమే విడుదల యిన ఈ మూవీ ఇటు ప్రేక్షకుల నుండి , అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం సాధించింది . 

రాకెట్రీ మూవీ ని ఇస్రో మాజీ శాస్త్రవేత్త అయిన నంబి నారాయణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు . ఇది ఇలా ఉంటే తాజా గా రాకెట్రీ మూవీ కోసం మాధవన్ తన ఇంటి ని అమ్ముకున్నాడు అంటూ ఒక నెటిజన్ ఒక పోస్ట్ చేశాడు . దీని పై తాజా గా మాధవన్ స్పందిస్తూ ...  ఆ నెటిజెన్ చేసిన పోస్ట్ లో ఏ మాత్రం నిజం లేదు అని మాధవన్ స్పష్టం చేశాడు . దయచేసి నా త్యాగాన్ని అతిగా చూడకండి .  నేను ఏ ఆస్తులను కూడా కోల్పోలేదు . రాకెట్రీ మూవీ లో భాగమైన వారందరూ కూడా ఈ ఏడాది సగర్వంగా భారీ మొత్తం లో ఐ టి లను చెల్లించ నున్నారు  .  ఇప్పటికి కూడా నేను నా ఇంట్లోనే నివసిస్తున్నాను అని మాధవన్ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: