మరో టాలీవుడ్ క్రేజీ దర్శకుడి మూవీ లో ఛాన్స్ కొట్టేసిన దుల్కర్ సల్మాన్..!

Pulgam Srinivas
మళయాల సినీ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు ఆయన దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళం సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దుల్కర్ సల్మాన్ , నాగ్ అశ్విన్ దర్శకత్వం లో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మహానటి మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో జెమినీ గణేషన్ పాత్రలో నటించిన దుల్కర్ సల్మాన్ తన నటన తో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా దుల్కర్ సల్మాన్ , హను రాఘవపూడి దర్శకత్వంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన సీతా రామం అనే తెలుగు మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ ఇప్పటికే అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ మూవీ లోని దుల్కర్ సల్మాన్ నటనకు గాను ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి ప్రశంసలు వెల్లు వెత్తు తున్నాయి. ఈ మూవీ ప్రస్తుతం కూడా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇలా దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే దుల్కర్ సల్మాన్ మరో తెలుగు మూవీ లో నటించనున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ...  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆనంద్ ,  గోదావరి ,  హ్యాపీ డేస్ , లీడర్ , ఫిదా , లవ్ స్టోరీ వంటి మూవీ లతో దర్శకుడిగా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ఒక మూవీ లో నటించబోతున్నట్లు , ఇప్పటికే ఈ మూవీ ఈ విషయమై శేఖర్ కమ్ముల మరియు దుల్కర్ సల్మాన్ కు మధ్య కథా చర్చలు కూడా నడుస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: