ఫ్లాపులతో సతమతమవుతున్న చైతూ.. ఈసారైనా సరైన నిర్ణయమేనా..!!

Divya
యువ హీరో నాగచైతన్య ఏడాది ప్రారంభం నుంచి అంతగా కలిసి రాలేదని చెప్పవచ్చు జనవరిలో విడుదల కావాల్సిన RRR, రాధే శ్యామ్ చిత్రాలతో థియేటర్లలో పూర్తిస్థాయిలో దేశవ్యాప్తంగా రీఓపెన్ కాకపోవడంతో తరువాత ప్రణాళిక నేపథ్యంలో సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ సమయాన్ని వాడుకోవాలని హడావిడిగా బంగార్రాజు సినిమాని దించారు.మనం తర్వాత తన తండ్రితో కలిసి నటించిన సినిమా ఇదే చైతన్య. ఈ మూవీ సోగ్గాడే చిన్నినాయన సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కించారు. అయితే ఆ స్థాయిలో ఈ సినిమా అనుకున్నంత ఫలితాన్ని అందించలేకపోయింది కానీ దీని తర్వాత రెండు సినిమాలు విడుదలయ్యి ఈ సినిమా స్థాయిని అందుకోలేకపోయాయి.
మనం వంటి ఏపీక్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత విక్రమ్ డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాతగా థాంక్యూ సినిమా విడుదల చేయగా ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ఆంధ్రప్రదేశ్లో పలు ఏరియాలలో ఈ సినిమా టికెట్ల కోసం డిస్కౌంట్ లు పెట్టిన కూడా సినిమాకి రాని పరిస్థితి ఏర్పడింది దీంతో ఈ సినిమా భారీ స్థాయిలో డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇదే ఏడాది బాలీవుడ్ కి పరిచయమైన లాల్ సింగ్ చడ్డా సినిమా పరిస్థితి కూడా ఇలాగే మిగిలిపోయింది బాక్సాఫీస్ వద్ద సూపర్ స్టార్ గా పేర్కొన్న అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమా కూడా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది.
ఇలా ఈ ఏడాది ప్రారంభం నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ రావడంతో నాగచైతన్య చాలా కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా సమాచారం.అందుకోసమే అంగీకరించిన ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లాల లేదా అన్న ఆలోచనలు ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ధుతా అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఇది దీంతోపాటు తమిళ డైరెక్టర్ విక్రమ్ ప్రభుత్వ ఒక బయిలింగ్ సినిమాని చేయబోతున్నారు ఈ సినిమా తర్వాత కూడా వరుస సినిమా చేయాలని పరుశురాం, నందిని రెడ్డి బొమ్మరిల్లు భాస్కర్ వంటి వారితో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోని వీరందరినీ హోల్డ్ లో పెట్టి వెంకట్ ప్రభు తో వచ్చే నెల షూటింగ్ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: