'మాచర్ల నియోజకవర్గం' మూవీ హిట్ కొట్టాలి అంటే ఇంకా అన్ని కోట్లు సాధించాల్సిందే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు ఆయన నితిన్ తాజాగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి ఏం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా ,  క్యాథరిన్ , కృతి శెట్టి ఈ మూవీ లో నితిన్ సరసన హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ లో రాజేంద్ర ప్రసాద్ , వెన్నెల కిషోర్ , మురళి శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఆగస్ట్ 12 వ తేదీన మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. కెరీర్ లో మొట్ట మొదటి సారి నితిన్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన మూవీ లో నటిస్తుండటంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలాగే ఈ మూవీ విడుదలకు ముందు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించే విధంగా ఉండటంతో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 21.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 22 కోట్ల భారీ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటి వరకు 6 రోజుల బాక్సా పీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న మాచర్ల నియోజకవర్గం మూవీ ప్రపంచ వ్యాప్తంగా 9.65 కోట్ల షేర్ , 16.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీనితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలబడి అంటే ఇంకా 12.35 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేయవలసి ఉంది. మరి ఈ మూవీ రాబోయే రోజుల్లో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: