రేజీనా కాసండ్ర... నివేదా థామస్ 'శాకిని డాకిని' సినిమా విడుదల తేదీ పిక్స్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ వున్న రెజీనా కసాండ్రా , నివేదా థామస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో మంచి మంచి పాత్రలలో నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకున్నారు. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న రెజీనా కసాండ్రా , నివేదా థామస్ ఇద్దరు కలిసి తాజాగా తాజాగా శాకిని ఢాకిని అనే మూవీ లో ప్రధాన పాత్రలలో నటించారు. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న ఇద్దరు హీరోయిన్ లు ఒకే మూవీ లో ప్రధాన పాత్రల్లో నటించడం వల్ల ఈ మూవీ పై సినీ ప్రేమికులు కాస్త ఆసక్తిని చూపిస్తూ వస్తున్నారు.
 

ఇలా సినీ ప్రేమికుల్లో కాస్త అంచనాలు కలిగి ఉన్న శాకినీ ఢాకినీ మూవీ విడుదల తేదీని తాజాగా ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. సెప్టెంబర్ 16 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా తాజాగా విడుదల చేసింది. మరి ఈ ఇద్దరు ముడుగుమ్మ లు  కలిసి నటించిన ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ మూవీ ని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో రూపొందించారు. ఈ మూవీ ని డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ కి రిచర్డ్ ప్రసాద్ కెమెరామెన్‌గా, మిక్కీ మెల్క్రెరీ ఈ మూవీ కి సంగీత దర్శకుడుగా పని చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: