శోభన్ బాబు ఇచ్చిన సలహాతోనే.. పొట్టి వీరయ్య స్టార్ గా మారాడట?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంత మంది కమెడియన్స్ మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటి వారిలో ఒకప్పుడు కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన పొట్టి వీరయ్య కూడా ఒకరు. ఈయన పేరు చెబితే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు. కానీ ఈ ఫోటో చూస్తే మాత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఓహ్ ఈయనేనా అని అనుకుంటారు అని చెప్పాలి. ఈయన ఒక మరుగుజ్జు. దాదాపు నాలుగు వందల సినిమాల్లో నటించి తన నటన తో శభాష్ అనిపించుకున్నాడు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. సూర్యాపేట జిల్లా పరిగిరి గ్రామం ఈయన  సొంతూరు.

 అయితే పదో తరగతి ఫెయిల్ అవ్వడంతో చివరికి ఏదో పని చేసుకోవాలని 1967 లో మద్రాసు వెళ్ళాడు పొట్టి వీరయ్య. అందులో ఆయనకు  శోభన్బాబు కనిపించాడు. ఈ క్రమంలోనే నాకు బయట ఉద్యోగాలు దొరకడం లేదు సినిమాల్లో ఏదైనా ఛాన్స్ ఇవ్వమని శోభన్బాబు అడిగాడట. ఇక ఆ మాట విన్న శోభన్ బాబు ఆయనకు ఒక మంచి సలహా ఇచ్చారు. నీలా ఉన్న వారికి సినిమాల్లో అవకాశాలు దొరకవని. కానీ భావ నారాయణ లేకపోతే విఠలాచార్య సినిమాలో మాత్రం తప్పక అవకాశాలు లభిస్తాయి. కుదిరితే వాళ్ళని వెళ్లి అడగండి అంటూ సలహా ఇచ్చారట. ఆ తర్వాత విఠలాచార్య ను కలిశారు వీరయ్య. అదృష్టం కొద్దీ  సినిమాల్లో అవకాశం వచ్చింది.

 అడ్వాన్సుగా ₹500 కూడా ఇచ్చారు. చెన్నై నగరానికి చేరిన తర్వాత తమిళ్ దాకా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు వీరయ్య. ఆ తర్వాత శోభన్బాబు నటించిన అగ్గి వీరుడు సినిమా లో నటించే  అవకాశం వచ్చింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. నాలుగు వందల సినిమాల్లో నటించారు. కోట్ల మంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఈయనకు  మల్లిక అనే మహిళతో వివాహం జరిగింది . కాగా 2008లో ఆయన భార్య మరణించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: