ఆ మూవీతో కెరీర్ ని ఆపేస్తా... అశ్వినీదత్..!

Pulgam Srinivas
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు సుదీర్ఘంగా నిర్మాత గా అద్భుత మైన విషయా లను బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటూ ముందు కు సాగి పోతున్న నిర్మాత లలో అశ్వినీ దత్ ఒకరు . అశ్విని దత్ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో విజయవంత మైన మూవీ లను నిర్మించారు . ఆ మూవీ లతో అశ్వినీదత్ అద్భుతమైన గుర్తింపును నిర్మాత గా దక్కించుకున్నారు . ఇది ఇలా ఉంటే తాజాగా అశ్వనీదత్ 'సీతా రామం' అనే మూవీ ని నిర్మించారు . ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరో గా నటించగా మృణాళినీ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. హను రాఘవపూడి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు .

ఆగస్ట్ 5 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తోంది . ఇది ఇలా ఉంటే తాజాగా అశ్వినీ దత్ ఓ ప్రముఖ టీవీ షో లో గెస్ట్ గా విచ్చేశారు . అందులో భాగంగా అశ్వనీ దత్ తనకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు తెలియ జేశారు . తాజా ఇంటర్వ్యూ లో భాగంగా అశ్వనీ దత్ మాట్లాడుతూ ... నిర్మాతగా కెరీర్ ని ప్రారంభించిన సమయం లో 16 లక్షలతో మూవీ నిర్మించినట్లు అశ్వినీదత్ తాజా ఇంటర్వ్యూ లో చెప్పు కొచ్చాడు . అలాగే జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ కి పార్ట్ 2 మూవీ ని నిర్మించి తన కెరీర్ ని ఆపేస్తాను అని అశ్వనీదత్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పు కొచ్చాడు. ఇలా తాజా ఇంటర్వ్యూ లో అశ్వినీ దత్ అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: