షూటింగ్ లో మరో సారి గాయాలపాలైన విశాల్..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు ఆయన విశాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కోలీవుడ్ ఇండస్ట్రీ లో హీరో గా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న విశాల్ తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు  లో కూడా డబ్ చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అనేక విజయాలను అందుకున్నాడు . విశాల్ కొంత కాలం క్రితమే సామాన్యుడు అనే మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు . ఈ మూవీ లో డింపుల్ హయాతి , విశాల్ సరసన హీరోయిన్ గా నటించింది . మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విశాల్ 'లాఠీ' అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు .

ఈ మూవీ కి వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే విశాల్ 'లాఠీ' మూవీ షూటింగ్ లో  గాయాలపాలు అయిన విషయం మనఅందరికి తెలిసిందే.  ఇది ఇలా ఉంటే తాజాగా విశాల్ మరో సారి గాయాలపాలు అయినట్లు తెలుస్తోంది. లాఠీ మూవీ షూటింగ్ లో గాయాలపాలు అయిన నటుడు  విశాల్ కోలుకొని తాజాగా చెన్నై లో తెల్లవారుజామున మార్క్ ఆంటోనీ మూవీ షూటింగ్ సమయంలో మరోసారి తీవ్రంగా గాయాలు అయినట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దానితో వెంటనే ఆ విశాల్ ని సమీపం లోని హాస్పిటల్ కి తరలించి మెరుగైన చికిత్స యూ అందిస్తున్నట్లు తెలుస్తుంది. మార్క్ ఆంటోనీ మూవీ కి ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: