హను రాఘవపూడి దర్శకత్వంలో నాని..!

Pulgam Srinivas
అష్టా చమ్మా మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకొని, ఆ తర్వాత అనేక వైవిధ్యమైన సినిమాలలో నటించి నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడం మాత్రమే కాకుండా అనేక విజయాలను టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్న నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా సిరి ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

నాచురల్ స్టార్ నాని కొంత కాలం క్రితమే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన అంటే సుందరానికి మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన అంటే సుందరానికి మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాని , శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న దసరా మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో నాని సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం దసరా మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నా నాని తన తదుపరి మూవీ ని కూడా సెట్ చేసుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... నాచురల్ స్టార్ నాని , హను రాఘవపూడి దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది వరకే నాని , హను రాఘవపూడి కాంబినేషన్ లో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే మూవీ తెరకెక్కింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మరో సారి ఈ హిట్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే హను రాఘవపూడి తాజాగా సీతా రామం సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి టాక్ ను అందుకొని బ్లాక్ బస్టర్ విజయం వైపు దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: