సమంత కెరియర్ లో ఊహించని ట్విస్ట్ !

Seetha Sailaja

నాగచైతన్య తో విడాకులు తరువాత ఒక్క క్షణం కూడ ఖాళీ లేకుండా తన కెరియర్ ను అన్నివిధాల ముందుకు తీసుకు వెళ్ళడానికి పక్కా ప్లాన్ ఉన్న సమంతకు ఊహించని అదృష్టం ఎదురైనట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే మూవీలో హీరోయిన్ గా అవకాశం సమంతకు వచ్చింది అన్నప్రచారం జరుగుతోంది.

అయితే సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో వరసపెట్టి సినిమాలు చేస్తున్న పరిస్థితులలో ఆమెకు టాలీవుడ్ నుండి ఈ బంపర్ అవకాశం వచ్చినప్పటికీ ఆమె తన డేట్స్ సద్దుబాటు చేసే విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నట్లు టాక్. కొరటాల శివ జూనియర్ ల మూవీ ప్రారంభం కావడానికి అనేక సమస్యలు ఎదురౌతున్న పరిస్థితులలో ఇప్పుడు సమంత డేట్స్ విషయం కూడ ఒక సమస్యగా మారింది అంటున్నారు.

జూనియర్ తో కొరటాల తీయబోతున్న సినిమాను పాన్ ఇండియా మూవీగా తీస్తున్న విషయం తెలిసిందే. దీనితో ఈమూవీ కోసం పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోయిన్స్ కోసం బాలీవుడ్ లో ప్రయత్నించినప్పటికీ ఆప్రయత్నాలు రకరకాల కారణాలతో ముందుకు వెళ్లలేదని తెలుస్తోంది. మొదట్లో ఈమూవీలో తారక్ పక్కన అలియా భట్ ను నటింపచేయడానికి చాల ప్రయత్నాలు చేసారు. అలియా కూడ జూనియర్ పక్కన నటించడానికి మొదట్లో అంగీకరించింది.

అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల తరువాత ఆమూవీలో తన పాత్రను తగ్గించేసారు అన్న కోపంతో మరో తెలుగు సినిమాను ఇప్పట్లో చేసే ఉద్దేశ్యంలో అలియా భట్ లేదు. దీనితో సమంత వైపు అడుగులు పడ్డాయి అని అంటున్నారు. అయితే ఈ లక్కీ ఛాన్స్ ను ఏదోవిధంగా తన డేట్స్ సద్దుబాటు చేసుకుని సమంత ఈమూవీలో నటించగలిగితే మళ్ళీ ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రేక్ వచ్చే ఆస్కారం ఉంది. అక్కినేని మాజీ కోడలు అయిన తరువాత సమంత కు తెలుగులో అవకాశాలు పెద్దగా రాకపోవచ్చు అన్న ఊహాగానాలకు చెక్ పడింది అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: