ఫుల్ స్పీడ్ లో 'వారసుడు' షూటింగ్..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినా తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సిరి ప్రేమికులకు పరిచయం చేయవలసిన అవసరం లేదు . తలపతి విజయ్ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన బీస్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు . మంచి అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా విడుదలైన బీస్ట్ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది . ఇలా బీస్ట్ మూవీ తో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయిన తలపతి విజయ్ ప్రస్తుతం టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కు తున్న వరిసు (వారసుడు) అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు . తమిళం లో ఈ సినిమా వరిసు అనే పేరుతో తెరకెక్కుతూ ఉండగా , తెలుగు లో ఈ మూవీ వారసుడు పేరుతో తెరకెక్కుతోంది .

ఈ మూవీ లో దళపతి విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా , ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సినీ కార్మికుల బంద్ కారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన సినిమా షూటింగ్ లు అన్నీ ఆగిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే, కానీ ఈ సినిమా తమిళ సినిమా అని దిల్ రాజు ప్రకటించడంతో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం వారసుడు మూవీ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. మరో వారం రోజుల పాటు కూడా ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. ఇలా వారసుడు మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: