మరో 20 సంవత్సరాలు మీకోసం ఇలానే కష్టపడతాను... నితిన్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన నితిన్ తాజాగా ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నితిన్ కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని దర్శకుడు పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

నితిన్ కెరీర్ లో మొట్ట మొదటి సారి పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో నటిస్తూ ఉండడం తో ఈ మూవీ పై నితిన్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నాడు . అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న మాచర్ల నియోజకవర్గం మూవీ ని ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నారు . ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించింది .

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా నితిన్ మాట్లాడుతూ ... మాచర్ల నియోజకవర్గం మూవీ నా మనసుకు చాలా దగ్గరైన సినిమా.  నేను ఇండస్ట్రీ కి వచ్చి ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. ప్రేక్షకుల మరియు  అభిమానుల సపోర్ట్‌ లేకుంటే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు.  మీ ప్రేమకి , అభిమానానికి థ్యాంక్స్‌. మరో 20 సంవత్సరాలు అయిన మీ కోసం నేను ఇలాగే కష్టపడతాను అని నితిన్ చెప్పు కొచ్చాడు. ఈ మూవీ లో నితిన్ సరసన క్యాథరిన్ , కృతి శెట్టి లు హీరోయిన్ లుగా నటించగా ,  ఈ మూవీ కి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ లో సముద్ర కని ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: