హీరోగా మహేష్ ఎంట్రి వెనుక అంత కథ ఉందా?

Purushottham Vinay
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు…తెలుగు చిత్ర పరిశ్రమ నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ చిన్నబ్బాయిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇక నిజానికి మహేష్ బాబుని హీరోని చేయాలనే ఉద్దేశం మొదట కృష్ణ గారికి లేదు.ఆయన తన పెద్దబ్బాయి అయిన రమేష్ బాబునే హీరోని చేద్దాం మొదట అనుకున్నారు.మహేష్ బాబు వ్యాపార రంగంలో రాణిస్తాడని ఇక ఆయనకు ఓ జ్యోతిష్యుడు చెప్పాడట. కృష్ణ జీవితంలో ఆ జ్యోతిష్యుడు చెప్పిన చాలా విషయాలు కూడా బాగా నెరవేరాయి.అందుకే కృష్ణ తన 'పద్మాలయ స్టూడియోస్' బ్యానర్లో నిర్మించబోయే సినిమాల పనుల్ని సూపర్ స్టార్ మహేష్ చేతిలో పెట్టాలని ఆయన మొదట భావించారు. కానీ మహేష్ బాబు విషయంలో కృష్ణ గారి ఆలోచనలు అనేవి చాలా తలక్రిందులు అయ్యాయి. ఇక ఆయన పెద్దబ్బాయి అయిన రమేష్ బాబు హీరోగా పెద్దగా క్లిక్ అవ్వలేదు.దీంతో మహేష్ బాబును హీరోగా లాంచ్ చేయాల్సి వచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా మొత్తం 9 సినిమాల్లో నటించిన సూపర్ స్టార్ మహేష్.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రజల మనస్సు దోచుకున్న మహేష్ లెజెండరి డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన 'రాజకుమారుడు' చిత్రంతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యాడు.


నిజానికి కృష్ణవంశీ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలి కానీ కొన్ని కారణాల వల్ల రాఘవేంద్ర రావు గారి చేతిలో పడ్డాడు మహేష్ బాబు.ఇక రాజకుమారుడు సూపర్ హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత తెలిసిందే. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సొంతంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ గా నెంబర్ వన్ హీరోగా నిలబడ్డాడు మహేష్.'ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి' అనే ప్రిన్సిపుల్ ను మహేష్ బాబు తూచా తప్పకుండా ఫాలో అవుతాడు. అంత పెద్ద స్టార్ అయిన చాలా సింపుల్ గా అందరితో బాగుంటారు మహేష్. తనతో పని చేసిన చాలా మంది నటి నటులు, ఆర్టిస్ట్ లు కూడా ఈ విషయం చెప్తూ ఉంటారు.సినిమాల్లో ఎంత స్టైలిష్ గా కనిపించినా కూడా రియల్ లైఫ్ లో మాత్రం ఒక సాధారణ వ్యక్తిలా ఒక ఫ్యామిలీ మ్యాన్ లా చాలా సింపుల్ గా కనిపిస్తాడు మహేష్. ఇక అంతేకాదు నిజ జీవితంలో కూడా మహేష్ హీరో అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: