అందుకే మహేష్ నెంబర్ 1 హీరో అయ్యాడు?

Purushottham Vinay
సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే సెల్ఫ్ మేడ్ స్టార్! తన తండ్రి సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారి అడుగు జాడల్లో నడుస్తూ సినిమా పరిశ్రమలో చాలా ఈజీగా ఆయన అడుగు పెట్టి ఉండవచ్చు.కానీ, ఇవాళ మహేష్ ఉన్న స్థానానికి చేరుకోవడం వెనుక ఆయన సొంత కృషి కూడా ఎంతో ఉంది. అదే ఈనాడు మహేష్ ని నెంబర్ వన్ హీరోని చేసింది.ఇక మహేష్ బాబు కెరీర్లో ఒక్కటి అంటే ఒక్క రీమేక్ సినిమా కూడా కనిపించదు. ఎందుకో తెలుసా? రీమేక్స్‌కు సూపర్ స్టార్ మహేష్ వ్యతిరేకం! ఒరిజినల్ కథలు చెయ్యడానికి ట్రై చేస్తారు. అలాగని, రీమేక్ చేసే హీరోలను ఆయన అసలు తక్కువ ఏమీ చేయరు. ఆల్రెడీ చెప్పిన కథలను మళ్ళీ చెప్పడం ఇంకా ఒకరు చేసిన పెర్ఫార్మన్స్ రిపీట్ చేయడం ఆయనకు ఇష్టం ఉండదు.ఒకానొక సందర్భంలో రీమేక్స్ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ ''నేను ఈ రీమేక్స్ ఎందుకు చేయను అంటే... ఆల్రెడీ ఒక సినిమా చూసిన తర్వాత సెట్స్ కు వెళితే? నాకు అందులో ఆ హీరోనే కనిపిస్తారు. ఆ హీరో చేసినట్టు చేయాలా? లేదంటే నేను సొంతంగా చేయాలా? అసలు ఎలా చేయాలి? ఒక కన్‌ఫ్యూజన్‌ స్టేట్‌లో ఉంటాను. అందుకే రీమేక్స్ అవాయిడ్ చేస్తాను'' అని చెప్పారు. ఆయన సినిమాలు ఇతర భాషల్లో కూడా రీమేక్ కావాలని ఆశిస్తున్నట్టు మరొక సందర్భంలో చెప్పారు.ఆ


మిర్ ఖాన్, మాధవన్ ఇంకా షర్మాన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ సినిమా 'త్రీ ఇడియట్స్'. తమిళంలో విజయ్ హీరోగా సౌత్ ఇండియన్ స్టార్ దర్శకుడు శంకర్ ఇక ఆ సినిమాను రీమేక్ చేశారు. తెలుగులో 'స్నేహితుడు' పేరుతో అనువదించి సినిమాని విడుదల చేశారు. నిజానికి, ఆ రీమేక్ ఆఫర్ ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరకు వచ్చింది. శంకర్ డైరెక్షన్ అయినప్పటికీ కూడా 'నో' చెప్పేశారు సూపర్ స్టార్.ఇక మహేష్ తండ్రి కృష్ణ ఒకప్పటి సూపర్ స్టార్.ఆయన మూడు వందలకు పైగా సినిమాల్లో నటించారు. అసలు ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. తెలుగు తెర కౌబాయ్ అంటే సూపర్ స్టార్ కృష్ణ గుర్తుకు వస్తారు. అలాగే జేమ్స్ బాండ్ తరహా గూఢచారి ఎవరు? అంటే ఖచ్చితంగా కృష్ణే గుర్తుకు వస్తారు.


అల్లూరి పాత్రకు తొలి తరం పేటెంట్ రైట్స్ కూడా కృష్ణవే అని చెప్పాలి. అటువంటి పాత్రల్లో మహేష్ బాబును చూడాలనేది ఘట్టమనేని ఫ్యాన్స్ కోరిక కూడా . అయితే తండ్రి చేసిన పాత్రలు మళ్ళీ చేయడానికి, తండ్రి సినిమాలు రీమేక్ చేయడానికి కూడా  సూపర్ స్టార్ మహేష్ బాబు సుముఖత వ్యక్తం చేయరు. ఇలా ఇండస్ట్రీకి సూపర్ స్టార్ కృష్ణ లాంటి భారీ మాస్ ఫాలోయింగ్ వున్న హీరో కొడుకుగా వచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోని తన తండ్రి లాగే తిరుగులేని సూపర్ స్టార్ గా టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నాడు మహేష్!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: