కృష్ణ వారసునిగా వచ్చి స్వయంకృషితో ఎదిగిన మహేష్!

Purushottham Vinay
సూపర్ స్టార్ మహేష్ బాబు లెజెండరి మాస్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి వారసుడిగా పెద్దగా కష్టపడకుండానే  సినిమాల్లోకి వచ్చాడు. కానీ స్టార్డమ్ మాత్రం అంత ఈజీగా రాలేదు. స్టార్ వార్ లో ఎన్నో హర్డిల్స్ ని దాటుకుని పెద్ద సూపర్ స్టార్ అయ్యాడు. ఫ్లాప్స్ వచ్చినప్పుడు నిరాశ పడుకుండా ఖలేజా ఉన్న కథలతో దూకుడు చూపించి సూపర్ స్టార్ టాప్ లేపేశాడు. సూపర్ స్టార్ తనయుడైనా.. తనూ సూపర్ స్టార్ అనిపించుకోవడానికి మహేష్ చాలా కష్టపడ్డాడు. ఇక ఆ కష్టానికి ఫలితం.. ఇప్పుడు మహేష్ బాబు టాలీవుడ్ నెంబర్ వన్ హీరో. క్లాస్ లోనూ ఇంకా మాస్ లోనూ తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకున్న ఏకైక హీరోగా ఇప్పుడు టాలీవుడ్ నెంబర్ వన్ హీరో పొజిషన్ లో ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.సూపర్ స్టార్ మహేష్ బాబు హిట్టు ఫ్లాపులతో సంబందం లేకుండా సినిమాలు చేస్తున్నాడు గానీ, చాక్లెట్ బాయ్ క్యారెక్టర్స్ తో మాస్ కి ఎక్కడం చాలా కష్టం. మాస్ ఆడియన్స్ లో ఫాలోయింగ్ లేకపోతే కృష్ణ వదిలిపెట్టిన ప్లేస్ ని రీప్లేస్ చెయ్యడం కష్టం అని సినీపెద్దలంతా కూడా మాట్లాడడం స్టార్ట్ అయ్యింది. ఇక మరి మాస్ అంటే ఏంటి? అందరినీ మెప్పించడమే కదా. యస్ ఒక్కడు సినిమాతో ఆపని పర్ఫెక్ట్ గా చేశాడు మహేష్ బాబు.హిట్స్ అయితే ఉన్నాయి. ఫ్లాప్స్ వచ్చినా కూడా అధైర్యపడకుండా దూసుకెళ్తున్నాడు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకేదో సాధించాలి.

అభిమానులంతా కూడా గర్వపడేలా, ఇక స్టార్ వార్ లో దుమ్ముదులిపేలా ఓ హిట్ కావాలి. అది ఫలానా హీరోకి ఫలానా సినిమా ఉందే.. అలా అని అంతా కూడా అనుకునేలా ఉండాలి.. అనుకుంటోన్న టైమ్ లోనే పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన పోకిరి సినిమా అభిమానుల ఆకలిని తీర్చింది. ఆ టైమ్ కు ఉన్న అన్ని సౌత్ ఇండియా సినిమాల రికార్డులను చెరిపేసి కొత్త రికార్డులు తిరగరాస్తూ మహేష్ ని టాప్ రేసులో నిలిపింది పోకిరి.సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోయిజాన్ని నమ్ముకుంది తక్కువ.తన కెరీర్ లో స్టోరీనే ఎక్కువ నమ్మాడు. తన చుట్టే సినిమా అంతా తిరగాలని ఆయన అనుకోలేదు. అందుకే వెంకటేష్ తో కలిసి మల్టీస్టారర్ మూవీ సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు కూడా చేశాడు. ఇక టాలీవుడ్ లో 20ఏళ్ల తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్ లో మహేష్ బాబు ఇమేజ్ రెండింతలు అయిందంటే అతిశయోక్తేం లేదు. శ్రీమంతుడు సినిమా తర్వాత భారీ హైప్స్ మధ్య వచ్చిన బ్రహ్మోత్సవం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన స్పైడర్ సినిమా కూడా అంతే అయింది.స్పైడర్‌తో ఫస్ట్ టైమ్ కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు.

ఆ సినిమా తమిళ్ లో హిట్ అయిన తెలుగులో అంచనాలు అందుకోలేక ప్లాప్ అయింది.దీంతో మరోసారి శ్రీమంతుడు సినిమా దర్శకుడుతో జోడీ కట్టాడు. వీరి కాంబినేషన్ లో ఉండే మ్యాజిక్ అనేది మళ్లీ రిపీట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన భరత్ అనే నేను సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీలో ఫస్ట్ టైమ్ ముఖ్యమంత్రిగా నటించాడు సూపర్ స్టార్ మహేష్. వారసుడుగా వచ్చినా కానీ స్వయంకృషితో ఎదిగాడు. భారీ కాంపిటీషన్ ఉన్నా కానీ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. కేవలం తన స్వలాభం కోసమే బ్రతకకుండా సమాజ సేవ కూడా చేస్తున్నాడు. తను సంపాదించే ప్రతి పైసాలో కొంత పేద వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నాడు. ఎంతో మంది చిన్న పిల్లలని బ్రతికిస్తున్నాడు.టాలీవుడ్ కమర్షియల్ మార్కెట్ ను ఓవర్శీస్ వరకూ కూడా తీసుకువెళ్లి.. మన సినిమాకు సరికొత్త మార్కెట్ ను అందించడంలో ముందున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరిన్ని మంచి సినిమాలతో మనల్ని అలరించాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: