ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుధీర్ బాబు ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో మూవీ లలో  హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరుచుకున్నాడు. సుధీర్ బాబు ఆఖరుగా krishna INDRAGANTI' target='_blank' title='ఇంద్రగంటి మోహనకృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన 'వి' మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో నాచురల్ స్టార్ నాని కూడా హీరోగా నటించాడు. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా ప్రముఖ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల అయ్యింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సుధీర్ బాబు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.
 

ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా , ఇంద్రగంటి మోహన కృష్ణ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ నుండి మూవీ యూనిట్ ఒక అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ను రేపు అనగా ఆగస్ట్ 10 వెస్ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలియ జేస్తూ మూవీ యూనిట్ ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు సమ్మోహనం , వి మూవీ లలో హీరోగా నటించాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మూడవ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: