ఈ వారం థియేటర్లలో ప్రేక్షకులను అలరించబోయే సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు థియేటర్ లలో ప్రేక్షకులను అలరించబోతున్నయి. అలా ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉన్నా సినిమాల గురించి తెలుసుకుందాం. ఈ వారం మొదటగా డబ్బింగ్ సినిమా అయిన లాల్ సింగ్ చడ్డా ఆగస్ట్ 11 వ తేదీన విడుదల కాబోతుంది.

ఈ మూవీ లో అమీర్ ఖాన్ హీరోగా నటించగా కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య కనిపించబోతున్నాడు. ఈ మూవీ ఆగస్ట్ 11 వ తేదీన హిందీ తో పాటు తెలుగు , తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ మూవీ పై దేశవ్యాప్తంగా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. నితిన్ హీరోగా క్యాథరిన్ , కృతి శెట్టి హీరోయిన్ లుగా , ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం మూవీ ఆగస్ట్ 12 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీ లో సముద్ర కని ప్రతి నాయకుడి పాత్రలో నటించగా,  మహతి స్వర సాగర్ ఈ మూవీ కి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించాడు.

ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై మంచి విజయం సాధించిన కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా కార్తికేయ 2 మూవీ ని తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే. కార్తికేయ 2 మూవీ లో నిఖిల్ హీరోగా నటించగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. చందు మొండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఆగస్ట్ 13 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: