మోహన్ బాబు.. ఆ హీరోయిన్ చెంప పగలగొట్టాడట తెలుసా?

praveen
టాలీవుడ్ లో విలన్ పాత్రల తో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత హీరోగా మారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించి తెలుగు ప్రేక్షకులకు కలెక్షన్ కింగ్ గా మారిపోయాడు మోహన్ బాబు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్న మోహన్ బాబుకు మాత్రం ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ ఉంటుంది అని చెప్పాలి. అదే ప్రేక్షకులకు బాగా దగ్గర చేసింది. కేవలం హీరోగా మాత్రమే సరిపెట్టుకోకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకు తిరుగు లేదు అని నిరూపించారు. అయితే ఇండస్ట్రీలో మోహన్ బాబు అంటే ఎంతో మంది భయపడిపోతుంటారు.

 ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన  ముందున్నది ఎంత పెద్ద వారైనా సరే మనసులో ఉన్నది కుండబద్దలు కొట్టేస్తూ ఉంటారు. ఇక ఆయన మాటలతో ఎంతోమందికి శత్రువు అవుతాడు అన్న టాక్ కూడా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు నడుస్తూ ఉంటుంది. అంతేకాదు మోహన్బాబు సరసన నటించే నటీనటుల విషయంలో కూడా ఎంతో కఠినంగానే ఉంటారట. అందరూ క్రమశిక్షణ పాటించాలని చెబుతూ ఉంటారట. ఎంత పెద్ద స్టార్ నటీనటులు అయినా సరే తన సినిమాల్లో ఉంటే కచ్చితంగా చెప్పిన టైంకి సెట్లో ఉండాల్సిందే. లేదంటే  వారిపై చిర్రుబుర్రులాడుతూ ఉంటాడట.

 అయితే మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఇండస్ట్రీ లోకి హీరోగా పరిచయమయ్యాడు. 2003 లో భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది విష్ణు సినిమా. అయితే ఈ సినిమా కోసం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్నా సాక్షి శివానంద్ సోదరి శిల్పా శివానంద్ ను పిలిపించారు దర్శక నిర్మాతలు. అయితే ఆమెకు కూడా ఇదే తొలి సినిమా కావడం గమనార్హం. అయితే శిల్పా శివానంద్ సెట్ లో పదేపదే దర్శకుడి ఇబ్బంది పెట్టిందట. దర్శకుడు మోహన్ బాబుకు ఇదే విషయాన్ని చెప్పారు. మోహన్ బాబు కూడా ఆమె ప్రవర్తనను గమనించి హీరోయిన్ కాస్త అతి చేసిందని భావించాడు. దీంతో ఏకంగా ఆమె చెంప పగలగొట్టాడు అన్న వార్త అప్పట్లో గట్టిగా వినిపించింది. ఈ విషయంపై శిల్పా శివానంద్  ఇండస్ట్రీ పెద్దలకు ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోలేదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: