విడుదలకు ముందు రోజు 'సీతా రామం' మూవీ యూనిట్ కు పెద్ద షాక్..!

Pulgam Srinivas
ప్రేమకథా చిత్రాలను వెండి తెరపై అద్భుతంగా తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన హను రాఘవపూడి తాజాగా సీతా రామం అనే ప్రేమ కథా చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.

రష్మిక మందన ఈ మూవీ లో ఒక ముఖ్యమైన కీలక పాత్రలో నటించగా , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , సుమంత్ ,  భూమిక చావ్లా , తరుణ్ భాస్కర్ ఈ మూవీ లో ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ మూవీ రేపు అనగా ఆగస్ట్ 5 వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు అంతా సిద్ధంగా ఉన్న సమయంలో తాజాగా ఈ మూవీ యూనిట్ కు భారీ షాక్ తగిలింది.  సీతా రామం మూవీ లో మతపరమైన సన్నివేశాలు ఉన్నాయనే కారణంతో గల్ఫ్ దేశాల్లో ఈ మూవీ రిలీజ్ కి అక్కడి సెన్సార్ బోర్డు నో చెప్పినట్లు తెలుస్తోంది.

అలా సీతా రామం మూవీ ని గల్ఫ్ దేశాల్లో రిలీజ్ కి అక్కడి సెన్సార్ బోర్డు నో చెప్పడంతో సెన్సార్ బోర్డు ను కలిసి సభ్యులు సూచించిన మేరకు అభ్యంతరకరమైన సన్నివేశాలు తొలగించి రిలీజ్ చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా ఆఖరి నిమిషంలో సీతా రామం మూవీ యూనిట్ కి గల్ఫ్ దేశాల్లో ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండటంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: