'థాంక్యూ' మూవీ డిజిటల్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు ఆయన నాగ చైతన్య వరుసగా మజిలీ , వెంకీ మామ , లవ్ స్టోరీ , బంగార్రాజు విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న సమయంలో థాంక్యూ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికి తెలిసిందే. థాంక్యూ మూవీ జూలై 22 వ తేదీన భారీ అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయ్యింది.

మంచి అంచనాల నడుమ విడుదలైన థాంక్యూ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర తీవ్రమైన నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. అలా బాక్సా ఫీస్ దగ్గర మొదటి రోజే నెగిటివ్ టాక్ ను తెచ్చుకోవటంతో ఈ సినిమాకు కలెక్షన్ లు కూడా పెద్దగా దక్కలేదు. దానితో చివరగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్  మూవీ గా మిగిలిపోయింది. ఇలా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయినా థాంక్యూ మూవీ మరి కొద్ది రోజుల్లో డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ...  థాంక్యూ మూవీ ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఆగస్ట్ 20 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.  థాంక్యూ సినిమాలో రాశి కన్నా హీరోయిన్ గా నటించగా , విక్రమ్ కె కుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించగా , ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో నాగ చైతన్య మూడు డిఫరెంట్ వేరియేషన్ ఉన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: