వారికి ఒటీటీ బంగారు బాతు అయ్యిందా!!

P.Nishanth Kumar
మారిన పరిస్థితుల నేపథ్యంలో సినిమాలు తెరకెక్కించే విధానం, అలాగే ప్రేక్షకులు ఆ సినిమాలను చూసే విధానం కూడా పూర్తిగా మారిపోయింది. ఆ విధంగా కరోనా దగ్గర నుంచి మెజారిటీ ప్రేక్షకులు ఓటీటీ లలో సినిమాలు చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్లు పూర్తిగా ఓపెన్ అయినా కూడా ఎందుకో టీవీలను వదిలి వారు సినిమాలను చూడడానికి పెద్దగా ఇష్టపడడం లేదు. దానికి తోడు ఓటీటీ లలో మంచి మంచి సినిమాలు వెబ్ సిరీస్ వస్తున్న నేపథ్యంలో ఈ విధంగా థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు తక్కువవుతుంది.

ఈ నేపథ్యంలో ఓటీటీ లలో పెద్ద పెద్ద హీరోలు నటించడం పెద్దగా జరగదు కాబట్టి ఫెడౌట్ హీరోలకు ఈ ప్లాట్ ఫామ్ మంచి అవకాశం గా మారింది. తెలుగులో చాలామంది కనుమరుగైపోయిన హీరోలు హీరోయిన్లు నటీనటులు అందరూ కూడా ఈ విధమైన వెబ్ సిరీస్ లలో, ఓటీటీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మరొకసారి ఆలదిస్తున్నారు. అలా తెలుగులో కనుమరుగైన హీరోలు చాలామందికి ఇది ఒక వరం అవుతుంది అని చెప్పాలి. నందమూరి తారకరత్న, సుశాంత్, ఆర్యన్ రాజేష్, నవీన్ చంద్ర, తరుణ్, వేణు తొట్టెంపూడి వంటి చాలామంది హీరోలు ఈ విధమైన వెబ్ సిరీస్ లలో నటిస్తూ మరొకసారి తమ సత్తా చాటుతున్నారు.

ఆ విధంగా వీరు ఈ సినిమాల ద్వారా సత్తా చాటుకొని మళ్లీ వెండితెరపై మునుపటి క్రేజ్ ను దక్కించుకుంటారా అనేది చూడాలి. ఇప్పటికే చాలామంది ఓటీటీ లలో రాణించి వెండితెర అవకాశాలు అందుకొని ప్రేక్షకులను వేరే స్థాయిలో అలరించి మంచి మంచి సినిమా అవకాశాలను పొందుతున్నారు. మరి ఈ ఓటీటీ ల ట్రెండ్ ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి. హీరోయిన్ ల కూడా దాదాపుగా తమ కెరియర్ పూర్తయింది అనుకుంటున్నా నేపథ్యంలో వారికి ఈ ఓటీటీ లు బంగారు బాతులలా మారాయి అని చెప్పవచ్చు. మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వారు వెండితెరను కూడా పూర్వ వైభవం అందుకుంటాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: