హీరోయిన్ రాధికకు.. ఆ స్టార్ క్రికెటర్ అల్లుడు అవుతాడు తెలుసా?

praveen
ఒకప్పటి అందాల హీరోయిన్ రాధిక గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో దశాబ్దాల నుంచి హీరోయిన్ గా హవా నడిపించిన రాధిక ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. తమిళ తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఒక దశాబ్ద కాలానికి పైగా వెలుగొందింది. తమిళంలో సూపర్ హీరోలు గా కొనసాగుతున్న రజనీకాంత్,కమల్ హాసన్, శరత్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించి సూపర్ డూపర్ విషయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక తెలుగులో సైతం చిరంజీవి సహా అందరు స్టార్ హీరోలతో నటించింది అని చెప్పాలి.

 ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి రాధిక కాంబినేషన్ ప్రేక్షకులకు అప్పట్లో ఫేవరేట్ కాంబినేషన్ గా ఉండేది. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ విషయాలు వచ్చాయి. అది సరే గానీ ఇప్పుడు రాధిక గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అని అంటారా.. రాధిక గురించి కాదు రాధిక కూతురి గురించి ఇప్పుడు ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఆమె గురించి మాట్లాడుకోవడానికి అంతలా ఏముందబ్బా అని ఆలోచనలో పడి పోకండి... నేను చెబుతాను కదా. వివరాల్లోకి వెళితే  ప్రముఖ మలయాళ నటుడు ప్రతాప్ పోతన్ ను పెళ్ళిచేసుకుంది రాధిక.  ఏడాదికే విడాకులు కూడా అయ్యాయి.  తర్వాత లండన్ లో రిచర్డ్ హార్టీ ని రెండో పెళ్లి చేసుకుంది. అతనితో ఒక పాపకు జన్మనిచ్చింది. ఇక ఆ తర్వాత వీరికి విడాకులు కాగా ప్రస్తుతం శరత్ కుమార్ ను మూడో పెళ్ళి చేసుకుని హాయిగా ఉంది రాధిక.

 అయితే రాధిక తన రెండో భర్త అయిన రిచర్డ్ తో కలిసి జన్మనిచ్చిన కుమార్తె పేరు రాయనే హార్టీ. ఈమె కర్ణాటక స్టార్ క్రికెటర్ అభిమన్యు మిథున్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అభిమన్యు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరఫున ఆడాడు. బెంగళూరులో మ్యాచ్ జరుగుతున్న సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. ఇలా రాధికకు స్టార్ క్రికెటర్ అభిమన్య మిథున్ అల్లుడు గా మారిపోయాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: