రైఫిల్ షూటింగ్ ఛాంపియన్ గా తల అజిత్!

Purushottham Vinay
ఇక తమిళ స్టార్ హీరోల్లో అజిత్ కుమార్ స్థానం గురించి ఎవరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాట కొన్ని లక్షలాది అభిమానులు అజిత్ సొంతం. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే ఇక. ఆయన బయటకి వస్తే ఇక అభిమానులు ఎగబడిపోతుంటారు.ఆయన రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అని చాలా సార్లు నిరూపించుకోవడం జరిగింది.ఇక రీసెంట్ గా మల్టీ టాలెంటెడ్ అని కూడా నిరూపించుకుంటున్నాడు అజిత్.రీసెంట్ గా రైఫిల్ పోటీల్లోకి ఎంట్రీ ఇచ్చారు స్టార్ హీరో అజిత్ కుమార్.47వ తమిళనాడు రైఫిల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో అజిత్ కుమార్ పాల్గొంటున్నాడు. ఈ పోటీలు ఈ నెల 25న మొదలు కాగా, పోటీ రెండో దశలో పాల్గొనేందుకు అజిత్ తిరుచ్చికి చేరుకున్నాడు. అజిత్ కుమార్ కి రైఫిల్ షూటింగ్లో మంచి నైపుణ్యం అనేది ఉంది. 2021 తమిళనాడు స్టేట్ రైఫిల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఆయన ఏకంగా ఆరు మెడల్స్ సాధించారు.దీంతో ఈ సారి కూడా రైఫిల్ పోటీల్లో పాల్గొనాలని అజిత్ కుమార్ నిర్ణయించుకున్నారు.


10 మీటర్లు, 25 మీటర్లు ఇంకా అలాగే 50 మీటర్ల విభాగంలో ఆయన ప్రాథమిక దశల్లో పాల్గొన్నారు. తిరుచ్చి రైఫిల్ క్లబ్ కు చేరుకున్న ఆయనకు అభిమానుల నుంచి మంచి స్పందన కూడా కనిపించింది. దీంతో ఆయన తన ఫ్యాన్స్ కి థంబ్స్ అప్ సంకేతం ఇచ్చారు.ఇక తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కేవలం సినిమా హీరోగానే కాదు బైక్ రేసర్ గా కూడా పేరు సంపాదించారు. ఆయన స్పోర్డ్స్ బైక్స్ తో పలు రేసులకు వెళ్తుంటారు. ఇంకా లాంగ్ డ్రైవ్ చేస్తూ.. దేశమంతా కూడా తిరుగుతుంటారు. ఇక ప్రస్తుతం అజిత్ ఏకే 61 సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఆ తర్వాత నయనతార భర్త యంగ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో కూడా ఓ మూవీలో నటించనున్నారు.ఇక రీసెంట్ గా విశ్వాసం సినిమాతో అజిత్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: