టాలీవుడ్ లేడీ ఓరియంటెడ్ చిత్రాలు అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు ఏంటంటే విజయశాంతి అని చెప్పాలి. లేడీ సూపర్ స్టార్ గా దశాబ్ద కాలం పాటు వెలుగు వెలిగిన సీనియర్ హీరోయిన్ విజయశాంతి వందల కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించారు. చిరంజీవి, నాగార్జున, బాలయ్య ఇంకా వెంకటేష్ ఇలా ఎంతో మంది స్టార్స్ తో పదుల కొద్ది సినిమాలు చేసింది. విజయశాంతి లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఇండస్ట్రీ హిట్ లు గా కూడా నిలిచాయి. పెద్ద హీరోల సినిమాల ను పక్కకు నెట్టి మరీ విజయశాంతి నటించిన సినిమాలు భారీ వసూళ్లు నమోదు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.కమర్షియల్ సినిమాలు రాజ్యం నడుస్తున్న ఆ రోజుల్లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి దక్కించుకున్న సక్సెస్ లు అనేవి ప్రపంచంలోనే ఏ హీరోయిన్ కూడా దక్కించుకుని ఉండదు.ఇక 1985 అక్టోబర్ 11న విజయశాంతి ప్రతిఘటన విడుదల అయ్యింది. విడుదల అయిన వారం రోజుల్లో మౌత్ టాక్ తో భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. అదే సంవత్సరం కృష్ణ నటించిన అగ్ని పర్వతం ఇంకా వజ్రాయుదం సినిమాలు సక్సెస్ అయ్యాయి, చిరంజీవి నటించిన అడవి దొంగ సినిమా కూడా అప్పుడు భారీ వసూళ్లను దక్కించుకుంది. కానీ అవేవి కూడా ప్రతిఘటన సినిమాను మించలేక పోయాయి.
విజయశాంతి ప్రధాన పాత్రలో దాసరి నారాయణ రావు దర్శకత్వంలో రూపొందిన ఒసేయ్ రాములమ్మ సినిమా వచ్చింది. 1997 లో మళ్లీ 1985 సీన్ అనేది రిపీట్ అయ్యింది. ఆ ఏడాదిలో పలు పెద్ద హీరోల సినిమాలు వచ్చినా కూడా రాములమ్మ సినిమా మాత్రం టాప్ చిత్రంగా నిలిచింది. 1997 లో చిరంజీవి నటించిన హిట్లర్ ఇంకా మాస్టర్ సినిమాలు ఇంకా నాగార్జున నటించిన అన్నమయ్య బాలకృష్ణ పెద్దన్నయ్య వెంకటేష్ ప్రేమించుకుందాం రా సినిమాలు వచ్చాయి. ఇవన్నీ కూడా బ్లాక్ బస్టర్ సినిమాలే అయినా ఒసేయ్ రాములమ్మ వసూళ్లను ఈ సినిమాలేవి బీట్ చేయలేక పోయాయి.ఇక 1997 లో టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఒసేయ్ రాములమ్మ నిలిచింది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా స్టార్ హీరోల సూపర్ హిట్ చిత్రాల వసూళ్లను క్రాస్ చేసి దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ విజయశాంతి అయితే ఒకటి కాదు ఏకంగా రెండు సార్లు ఆ ఫీట్ ను సాధించింది. ఇక రాబోయే రోజుల్లో కూడా రాములమ్మ రికార్డులను ఎవరు బ్రేక్ చేయలేక పోవచ్చు.