రామారావు ఆన్ డ్యూటీ మూవీ నుంచి మాస్ నోటీస్..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ కొంత కాలం క్రితమే రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఖిలాడి మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు . మంచి అంచనాల మధ్య విడుదల అయిన ఖిలాడి మూవీ ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ మూవీ గా మిగిలి పోయింది .

అలా ఖిలాడి మూవీ లాంటి ఫ్లాప్ తర్వాత రవితేజ  'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ తో ప్రేక్షకులను పలకరించటానికి రెడీ అయిపోయాడు . రామారావు ఆన్ డ్యూటీ మూవీ జూలై 29 వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది . ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో మూవీ యూనిట్ ఫుల్ స్పీడ్ లో ఈ మూవీ ప్రమోషన్ లను కొనసాగిస్తున్నారు . అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ టీజర్ , ట్రైలర్  మరియు కొన్ని పాటలను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ ఎత్తులో నిర్వహించింది . ఇది ఇలా ఉంటే తాజాగా రామారావు ఆన్ డ్యూటీ చిత్ర బృందం ఈ సినిమా నుండి మరో అప్డేట్ ను కూడా విడుదల చేసింది .

రామారావు ఆన్ డ్యూటీ మూవీ నుండి రామారావు మాస్ నోటీస్ ను ఈ రోజు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది . మరి రామారావు మాస్ నోటీస్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టు కుంటుందో చూడాలి . ఈ మూవీ కి శరత్ మండువ దర్శకత్వం వహించగా ,  దివ్యాంశ కౌశిక్ , రాజిష విజయన్ హీరోయిన్ లుగా నటించారు.  చాలా రోజుల తర్వాత వేణు తొట్టెంపూడి ఈ మూవీ లో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: