'ఎస్ఎస్ఏంబి 28' లో ఆ సీనియర్ హీరో..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం భరత్ అనే నేను , మహర్షి ,   సరిలేరు నీకెవ్వరు , సర్కారు వారి పాట లాంటి వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరియర్ లో 28 మూవీ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చిత్ర బృందం చాలా రోజుల క్రితమే చేసింది.

అలాగే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ ను ఆగస్ట్  నెలలో మొదలు పెట్టనున్నట్లు , అలాగే మూవీ ని వచ్చే సంవత్సరం వేసవి లో విడుదల చేయనున్నట్లు కూడా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాలీవుడ్ సీనియర్ నటులలో ఒకరు అయిన అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అని అనేక వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇది ఇలా  ఉంటే తాజాగా ఈ మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ హీరోలలో ఒకరు ఆయన రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడు అని , ఈ మూవీ కి రాజశేఖర్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది అని ఒక వార్త వైరల్ అవుతుంది.

మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుండగా ,  ఈ సినిమాకి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇది వరకే మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రెండు సినిమాలు తెరకెక్కాయి. మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: