క్రికెట్ ఆడుతూ ప్రముఖ కమెడియన్ మృతి..!!

Divya
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలలో ఎక్కువగా వరుస మరణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.. ఇప్పుడు తాజాగా మరొక విషాదం చోటు చేసుకున్నది ప్రముఖ బాలీవుడ్ బుల్లితెర నటుడు కమెడియన్ అయినా దీపేష్ బాన్ ఈరోజు ఉదయము మరణించడం జరిగింది. ఈయన వయసు ప్రస్తుతం 41 సంవత్సరాలు. నిన్నటి రోజున క్రికెట్ ఆడుతూ ఉండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఈ నటుడు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేయడం జరిగింది. బాబీ జి ఘర్ పర్ హై వంటి సీరియల్ తో మంచి పాపులర్ పేరు సంపాదించాడు దీపేష్.

ఇక నటన జీవితంలో ఎన్నో కమెడియన్ పాత్రలను పోషించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు . కమెడియన్ కింగ్ గా పేరుపొందారు. ఇక అంతే కాకుండా కామెడీ క్లబ్, బూత్ వాలా , ఎఫ్ ఐ ఆర్ వంటి సోల ద్వారా బాగా పేరు సంపాదించారు. పలు సినిమాలలో కూడా కమెడియన్ గా నటించారు దీపేష్. అని ఈయన హఠాత్ మరణంతో ఒక్కసారిగా బాలీవుడ్ పరిశ్రమ విషాదఛాయలు నెలకొన్నాయి ఆయన అభిమానులు సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం తెలియజేస్తూ ఉన్నారు.

దీపేష్ మరణ వార్తని ఈయన సహనటి అయిన ప్రముఖ టీవీ స్టార్ కవిత కౌశిక్ తన ట్విట్టర్ నుంచి తెలియజేయడం జరిగింది.. నిన్నటి రోజున దీపేష్ మరణ వార్త వినడంతో మేమంతా ఒక్కసారిగా శాఖ గురయ్యాము.దీపేష్ చాలా ఫీట్ గా ఉండేవారు తనకు ఆల్కహాల్ సిగరెట్ వంటి అలవాట్లు ఏమీ లేవు ఆరోగ్యానికి హాని తలపెట్టి ఏ అలవాటు కూడా దగ్గరకు రానివ్వడు అని తెలియజేసింది. ఇక అంతే కాకుండా తన పాప, భార్య, తల్లిదండ్రులను విడిచి వెళ్లడం అందరికీ బాధాకరంగా ఉందని తెలియజేసింది ఎక్కడ ఉన్న తన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఒక ఎమోషనల్ పోస్టును చేసింది కవిత. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: