కేక్ తో వివరణ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి !

Seetha Sailaja
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన సినిమాలు ఇప్పటివరకు కేవలం రెండు మాత్రమే. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ మూవీతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో ‘జాతిరత్నాలు’ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఈ హిట్ తరువాత అతడికి ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకోకుండా తన కెరియర్ విషయమై చాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఈ యంగ్ హీరో అనుష్క శెట్టితో ఒక మూవీలో నటిస్తున్నాడు అన్న వార్తలు ఎప్పటి నుంచో వచ్చాయి. ఈ మూవీ కథ రీత్యా నవీన్ పోలిశెట్టి 25 సంవత్సరాల యువకుడుగా కనిపిస్తే అనుష్క 40 సంవత్సరాల పెళ్ళి కాని మహిళగా కనిపించబోతోంది. అయితే ఈ మూవీ కథ అనుష్క కు నచ్చినప్పటికీ నవీన్ పోలిశెట్టి పక్కన నటించడానికి ఒప్పుకోలేదు అంటూ అనేక వార్తలు వచ్చాయి.

దీనితో ఈ మూవీ ఆగిపోయింది అంటూ ప్రచారం జరిగింది. అంతేకాదు అనుష్క ఇక సినిమాలలో నటించదనీ అంటూ ఊహాగానాలు కూడ వచ్చాయి. అయితే ఈవార్తలు అన్నింటికీ చెక్ పెడుతూ నవీన్ పోలిశెట్టి బయటపెట్టిన న్యూస్ తో ఈ మూవీ పట్టాలు ఎక్కినట్లుగా కనిపిస్తోంది. ఈ మూవీ సెట్ లోకి వచ్చిన అనుష్క కు స్వాగతం పలుకుతూ నవీన్ పోలిశెట్టి “17 years ikkada” అంటూ ఒక కేక్ పై పెద్దపెద్ద అక్షరాలతో వ్రాసిన కేక్ ను ఒక చేతితో అనుష్క పట్టుకుని ఉంటే మరొక చేతితో నవీన్ పోలిశెట్టి అందిస్తూ తీయించుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

అనుష్క కెరియర్ లో 48వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీలో అనుష్క ను నటింపచేయడానికి ప్రభాస్ ఆమెను చాల ఒత్తిడి చేసాడు అన్న గాసిప్పులు కూడ ఉన్నాయి. మహేష్ అన్న యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ కథ డిఫరెంట్ కావడంతో ఈ మూవీ పై చాల అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ చాల వేగంగా జరుగుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: