యువి క్రియేషన్స్ బ్యానర్ లో సూర్య 42వ సినిమా... దర్శకుడు ఎవరో తెలుసా..?

Pulgam Srinivas
కోలీవుడ్ మరియు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజ్ ఉన్న కొంత మంది హీరో లలో సూర్య ఒకరు. సూర్య , మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గజిని మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. అప్పటి నుండి సూర్య దాదాపు ఏ మూవీ లో నటించిన ఆ మూవీ ని తెలుగు లో కూడా డబ్ చేసి విడుదల చేస్తూ వస్తున్నాడు.

అందులో భాగంగా ఇప్పటికే సూర్య తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో విడుదల చేశాడు. అందులో కొన్ని మూవీ లు అదిరి పోయే కలెక్షన్ లను కూడా టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే సూర్య ఆకారుగా హీరో గా ఈటి మూవీ లో నటించాడు. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా , పండిరాజ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. అలాగే లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ మూవీ లో సూర్య చిన్న గెస్ట్ రోల్ పాత్రలో నటించాడు. విక్రమ్ మూవీ లోని సూర్య పాత్రకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే తాజాగా సూర్య తన 42 వ మూవీ ని ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సూర్య 42 వ ఈ మూవీ ని ప్రముఖ నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించనుండగా , కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన శివ ఈ మూవీ కి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు లో రవితేజ హీరోగా తెరకెక్కిన దరువు మూవీ కి శివ దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: