ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆ ముద్దుగుమ్మ..!

Pulgam Srinivas
యంగ్ బ్యూటీ మాళవికా మోహనన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ మలయాళ సినిమా పట్టం పోలే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యింది . ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన పేట మూవీ లో మాళవికా మోహనన్ కీలక పాత్రలో నటించింది .

ఈ సినిమా ద్వారా ఈ ముద్దు గుమ్మ కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది . పేట సినిమా ద్వారా కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్న మాళవికా మోహనన్ ఆ తర్వాత తళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్టర్ మూవీ లో కథానాయికగా నటించింది . ఈ సినిమా ద్వారా ఈ ముద్దు గుమ్మ తమిళ తో పాటు తెలుగు లో కూడా మంచి గుర్తింపు ను దక్కించుకుంది . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ ఒక క్రేజీ తెలుగు మూవీ లో అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది . రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా మాళవికా మోహనన్ మూవీ యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్త కనుక నిజం అయితే మాళవికా మోహనన్ అదిరిపోయే మూవీ లో ఛాన్స్ కొట్టేసినట్టే అవుతుంది. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ అక్టోబర్ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు మారుతి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: