పాపం.. ఫ్రాంక్ పేరుతో శ్రద్దా దాస్ ను ఏడిపించారుగా?

praveen
మొన్నటి వరకు ఈ టీవీలో ప్రసారమయ్యే బుల్లితెర కార్యక్రమాలు అన్నీ కూడా టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ ఉండేవి. కానీ ఇటీవలి కాలంలో మాత్రం అన్ని షో ల రేటింగ్ క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. దీనికి కారణం అందరికీ ఇష్టమైన సుధీర్ లేకపోవడమే అన్నది ఎంతో మంది చెబుతున్న మాట. ఢీ షో నుంచి సుధీర్ తప్పుకున్న తర్వాత ఒక్కసారిగా రేటింగ్ పడిపోయింది. ఈ క్రమంలోనే ప్రతి వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు వినూత్నమైన కాన్సెప్టును ఆలోచిస్తున్నారు ఢీ షో నిర్వాహకులు.

 ఇకపోతే గత ఏడాది బ్లాక్ బస్టర్ రౌండ్ పేరుతో ఇక సూపర్ హిట్ సినిమాలను పర్ఫామెన్స్ గా చేసి ప్రేక్షకులను అలరించారు. కాగా వచ్చే వారం  ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ ప్రోమో లో భాగంగా మరో కొత్త కాన్సెప్ట్ ఆలోచించారు అన్నది తెలుస్తుంది.  ఈ ప్రోమో లో భాగంగా ఫన్ పటాకా అనే యూట్యూబ్ ఛానల్ లో ప్రాంక్స్ చేస్తూ నెటిజన్లను ఆకర్షించిన కిరణ్ ను పిలిచి ఒక ఆసక్తికర ప్రాంక్ చేయించినట్లు తెలుస్తోంది.

 ఈ క్రమంలోనే ముందుగా శ్రద్దాదాస్ ఓ కొరియోగ్రాఫర్ తో డాన్స్ చేస్తుంది. దీంతో ఫన్ పటాకా కిరణ్ అక్కడికి వచ్చి మీరు వారితో ఎందుకు డాన్స్ చేశారు పార్షియాలిటీ చూపిస్తున్నారా అంటూ ప్రశ్నిస్తాడు ప్రాంక్ స్టార్ కిరణ్. మీరు ఎందుకు అంత సెన్స్ లెస్ గా మాట్లాడుతున్నారు అంటూ శ్రద్దాదాస్ సీరియస్ అవుతుంది. మీరు ఎందుకు నామీద అరుస్తున్నారు.. నేను ఏం చేయాలో మీరే చెప్తారా.. మీరు ఒక జడ్జ్ సీట్లో ఉండి సెన్స్ లెస్ అనే పదం ఎలా ఉపయోగిస్తారు అంటూ కిరణ్ అనడం తో స్టేజ్ కిందకి దిగిపోయిన శ్రద్దాదాస్ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇది చూసిన అభిమానులు మీ రేటింగ్ కోసం శ్రద్దాదాస్ నీ కన్నీళ్లు పెట్టించారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: