హీరో సూర్యకి కోర్టు నుంచి ఊరట..!!

Divya
తమిళ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ తేజ జ్ఞానవెల్ కు కోర్టు ఊరట నిచ్చింది. తాజాగా మద్రాస్ హైకోర్టు వీరిద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది. సూర్య ముఖ్యమైన పాత్ర లో నటించిన చిత్రం జై భీమ్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఒకేసారి అన్ని భాషలలో విడుదలై మంచి స్పందన లభించింది.

ఈ సినిమా డైరెక్టర్ సూర్య నటనకు సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకోవడం జరిగింది. అయితే జై భీమ్ సినిమా లో వన్నియార్ సంఘాన్ని చాలా తక్కువ చేసి చూపించాలని హీరో సూర్య డైరెక్టర్ డీజే జ్ఞానవెల్, నిర్మాత జ్యోతికపై వన్నియర్ సంఘం వారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కేసు జులై 18 వ తేదీన విచారణ జరిపారు. మద్రాసు హైకోర్టు మాత్రం తదుపరి విచారణ వరకు హీరో డైరెక్టర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసులో సూర్య, జ్ఞానవెల్ ,జ్యోతిక లకు జులై 21న కోర్టు విచారణకు రమ్మని ఆదేశాలు జారీ చేసింది అప్పటివరకు వారిపై జై భీమ్ చిత్ర యూనిట్ పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకూడదని జస్టిస్ సతీష్ కుమార్ తెలియజేశారు. జై భీమ్ సినిమాలో వన్నియర్ సంఘాన్ని తక్కువ చేసి చూపించడం పై ఆ నేతలు ఆగ్రహం చేశారు. ఇక వారి యొక్క సన్నివేశాలను తొలగించాలని అంతేకాకుండా వారికి రూ.5 కోట్ల పరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో కమ్యూనిటీ సంఘంతో సంబంధం ఉన్న రాజకీయ నాయకులు గుర్తులు ఉన్నాయని వన్నియార్ సంఘం కోతులు కేసు వేయడం జరిగింది. ఇక డైరెక్టర్ జ్ఞాన వేలుకు కూడా కొంతమంది బెదిరించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: